
ఇవాళ వరల్డ్ వెజిటేరియన్ డే.. శాఖాహారం అనేది ఒక ట్రెండ్ కాదు, దీని వల్ల మన గుండె ఆరోగ్యనికి, శరీరానికి చాల మేలు చేస్తుంది. కొన్ని రకాల క్యాన్సర్ రాకుండా ఇంకా శాఖాహారులు తక్కువగా జబ్బు పడే అవకాశం ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఉదాహరణకు, మొక్కల ఆహారం తీసుకోవడం వల్ల కొలొరెక్టల్, కడుపు ఇతర క్యాన్సర్‌ల ప్రమాదాన్ని తగ్గించవచ్చు.
శాఖాహార ఆహారాలలో ఫైబర్ (పీచు పదార్థం), యాంటీఆక్సిడెంట్లు, ఫైటోన్యూట్రియెంట్లు (మొక్కల్లో ఉండే మంచి పోషకాలు) పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరాన్ని హానికరమైన ఫ్రీ రాడికల్స్ (శరీరానికి నష్టం చేసే పదార్థాలు) నుండి రక్షించడంలో సహాయపడతాయి అలాగే మీ మొత్తం రోగనిరోధక శక్తికి (ఇమ్యూనిటీకి) మద్దతు ఇస్తాయి.
శాఖాహార ఆహారం గుండె ఆరోగ్యానికి కూడా చాలా మంచివి. వాటిలో కొవ్వులు (Saturated fats), కొలెస్ట్రాల్ సహజంగా తక్కువగా ఉంటాయి, ఇది మీ గుండెను బలంగా ఉంచడానికి సహాయపడుతుంది. శాఖాహారం పాటించే వారికీ బీపీ, గుండె జబ్బుల ప్రమాదం తక్కువగా ఉంటుంది. ఎక్కువ పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, పప్పు ధాన్యాలు తినడం గుండెకు మేలు చేయడమే కాకుండా ఆరోగ్యకరమైన శరీర బరువు నిర్వహించడంతో పాటు జీర్ణ ప్రక్రియ మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
ప్రపంచ శాఖాహార దినోత్సవం అనేది మొక్కల ఆహారం తెలుసుకోవడానికి, కొత్త రుచులను కనుగొనడానికి, మీ ఆరోగ్యం ఇంకా మొత్తం శరీరానికి ఆకుపచ్చ ఆహారం ఎంత మంచిదో తెలుసుకోవడానికి సరైన అవకాశం.