విశాఖ తీరంలో రెండో ప్రపంచ యుద్ధ కాలం బంకర్లు

విశాఖ తీరంలో రెండో ప్రపంచ యుద్ధ కాలం బంకర్లు

విశాఖ సాగరతీరంలో రెండో ప్రపంచయుద్ధం నాటి కాంక్రీటు బంకర్లు బయటపడ్డాయి. విశాఖ, యారాడ, జాలరిపేట తదితర ప్రాంతాల్లో తీర ప్రాంతంలోని ఇసుక కోతకు గురి కావడంతో ఈ బంకర్లు బయటపడ్డాయి.

రెండో ప్రపంచ యుద్ధ సమయంలో బ్రిటీష్ వారి తరపున భారత నావికులు జపాన్ తో పోరాడారు. ఆ సమయంలో శత్రుదేశం వాయు, నౌక దాడుల నుంచి ఈ బంకర్ల ద్వారా సైనికులు రక్షణ పొందారు. ఈ బంకర్లను కాంక్రీట్ తో నిర్మించారు. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో విశాఖపై దాడి చేసేందుకు జపాన్ సిద్ధపడినట్టు కూడా చరిత్రకారులు చెపుతున్నారు. ఈ ప్రాంతం వ్యూహాత్మకంగా ఎంతో కీలకమైనది కావడంతో తూర్పు నావికాదళాన్ని ఏర్పాటు చేశారు.

సాగర తీరంలో బయట పడ్డ బంకర్లను చూసేందుకు స్థానికులు ఆసక్తి చూపిస్తున్నారు.