వరల్డ్ కప్ టీమ్ ను ప్రకటించిన ఆసీస్ బోర్డు

వరల్డ్ కప్ టీమ్ ను ప్రకటించిన ఆసీస్ బోర్డు

వరల్డ్ కప్ కు టీమ్ ను ప్రకటించింది ఆసీస్ బోర్డు. ప్రపంచకప్ లో పాల్గొనే 15 మంది సభ్యులతో జట్టును ప్రకటించింది. అయితే ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్, డ్యాషింగ్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ కు జట్టులో చోటు దక్కింది. ఈ ఇద్దరు గతేడాది బాల్ టాంపరింగ్ వివాదంలో చిక్కుకొని ఏడాది పాటు క్రికెట్ నుంచి నిషేధానికి గురయ్యారు. అయితే సస్పెన్షన్ టైం ముగియటంతో…ప్రస్తుతం  ఐపీఎల్ లో ఆడుతున్న ఇద్దరు ప్లేయర్లు ఫుల్ ఫామ్ లో ఉన్నారు. దీంతో వాల్డ్ కప్ కు చాన్స్ ఇచ్చింది బోర్డు. అయితే వార్నర్, స్మిత్ జట్టులో చేరనుండటంతో… బ్యాట్స్ మన్ పీటర్స్ హ్యాండ్స్ కాంబ్, ఫాస్ట్ బౌలర్ హెజిల్ వుడ్ ను పక్కన పెట్టింది టీమ్ మేనేజ్ మెంట్.

భారత్ లో జరిగిన సిరీస్ లో రాణించిన ఉస్మాన్ ఖవాజాతో పాటు షాన్ మార్ష్ కు వాల్డ్ కప్ టీమ్ లో చోటు దక్కింది. అయితే కెప్టెన్ ఆరోన్ ఫించ్ ఆల్ రౌండర్లు స్టోయినీస్, మ్యాక్స్ వెల్ పై తమకు పూర్తి స్థాయిలో నమ్మకం ఉందని ప్రకటించింది. వికెట్ కీపర్ గా అలెక్స్ కేరి, బౌలింగ్ విభాగంలో ప్యాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, రిచర్డ్ సన్, నాథన్ కాల్టర్నైల్, బ్రెహ్రెండార్ఫ్ ను టీమ్ లోకి తీసుకుంది. అటు స్పిన్ విభాగంలో నాథన్ లైయన్, ఆడమ్ జంపాలకు స్థానం కల్పించింది. వాల్డ్ కప్ లో భాగంగా ఆస్ట్రేలియా తొలి మ్యాచ్ ను జూన్ 1న ఆఫ్గనిస్థాన్ తో తలపడనుంది.