ఎయిర్ పోర్ట్ లో గోల్డ్  కంటైనర్ చోరీ

ఎయిర్ పోర్ట్ లో గోల్డ్  కంటైనర్ చోరీ

టొరంటోలోని పియర్సన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో శుక్రవారం ( ఏప్రిల్ 21)  విలువైన వస్తువులు అదృశ్యమయ్యాయి. ఇది ఇటీవలి కాలంలో ఉత్తర అమెరికాలో జరిగిన అతిపెద్ద దోపిడీలలో ఒకటి.   ఏప్రిల్ 17న  14.8 మిలియన్ డాలర్లు (రూ. 121 కోట్లు) విలువైన బంగారం, ఇతర విలువైన వస్తువులు చోరీకి గురైనట్లు కెనడా అధికారులు తెలిపారు.సరుకులను తీసుకువెళుతున్న ఎయిర్‌క్రాఫ్ట్ కంటైనర్ విమానాశ్రయానికి చేరుకున్న తరువాత  కార్గో హోల్డింగ్ కు తీసుకెళ్లారు. ఆ సమయంలో దోపిడి జరిగిందని భావిస్తున్నారు.

పీల్ రీజినల్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ స్టీఫెన్ డ్యూవెస్టన్ బృందం ఈ దోపిడి  అరుదైన సంఘటనగా అభివర్ణించారు.  తప్పిపోయిన విమానం కంటైనర్ లో బంగారం,విలువైన వస్తువులు ఉన్నాయని చెప్పారు. ఏ ఎయిర్‌లైన్ కార్గోను పంపింది, ఎక్కడ లోడ్ చేయబడిందో .. ఎక్కడకు చేరాలి అనే విషయాలు ఇంకా తెలియాల్సి ఉంది. దొంగలు విమానాశ్రయానికి రాలేదని ...అయితే ప్రాథమిక భద్రతా రేఖకు వెలుపల లీజుకు ఇచ్చిన గిడ్డంగిలోని ఒక పబ్లిక్ భాగంలోకి వచ్చి దోపిడీ చేసినట్లు పోలీసులు తెలిపారు. 

అతిపెద్ద దోపిడి

ఇది కెనడియన్ చరిత్రలో అతిపెద్ద దోపిడీలలో ఒకటిగా కెనడా పోలీసులు తెలిపారు. 2012లో  గ్రేట్ కెనడియన్ మాపుల్ సిరప్ హీస్ట్, క్యూబెక్‌లో 3,000 టన్నుల సిరప్ దొంగిలించారు. 1952 సెప్టెంబర్  25 న  పియర్సన్ ముందున్న మాల్టన్ విమానాశ్రయంలో 215,000  డాలర్ల విలువైన బంగారం దొంగిలించబడింది. దోపిడీ సమయంలో, దొంగలు మాంట్రియల్‌కు వెళ్లే విమానంలో వాటిని లోడ్ చేయడానికి ముందు విమానాశ్రయంలోని కార్గో ప్రాంతం నుండి ఉక్కు బోనులతో కూడిన ఆరు చెక్క పెట్టెలను తీసుకున్నారు.