ఒక పారా ఒలింపియన్​.. ప్రపంచంలోనే తొలి పారా ఆస్ట్రోనాట్​ గా మారిండు!

ఒక పారా ఒలింపియన్​.. ప్రపంచంలోనే తొలి పారా ఆస్ట్రోనాట్​ గా మారిండు!

ప్రపంచంలోనే తొలి దివ్యాంగ ఆస్ట్రోనాట్​ (వ్యోమగామి)గా జాన్​ మెక్​ ఫాల్​ చరిత్రకెక్కారు.భవిష్యత్తులో  తాము చేపట్టే రోదసీ యాత్రల కోసం ట్రైనింగ్​ ఇచ్చేందుకు ఆయనను ఎంపిక చేశామని యూరోపియన్​ స్పేస్​ ఏజెన్సీ వెల్లడించింది.  బ్రిటన్​ కు చెందిన జాన్​ మెక్​ ఫాల్​ గతంలో  పారా ఒలింపిక్స్​ లో అథ్లెట్​గానూ పాల్గొన్నారు. దివ్యాంగులు అంతరిక్ష వాతావరణంలో ఎలా ఉండగలరు ? వారికి ఎదురయ్యే ప్రతికూలతలు ఏమిటి ? దివ్యాంగులకు సౌకర్యవంతమైన రోదసీ యాత్రను ఎలా డిజైన్ చేయాలి ? అనే అంశాలపై అధ్యయనం కోసం జాన్​ మెక్​ పాల్​ సేవలను వినియోగించుకోనున్నారు.

పారా ఆస్ట్రోనాట్​ పోస్ట్​ కోసం యూరోపియన్​ స్పేస్​ ఏజెన్సీకి వందలాది అప్లికేషన్లు రాగా.. వాటిని జల్లెడ పట్టి చివరకు జాన్​ మెక్​ఫాల్​ కు దివ్యాంగుల కేటగిరిలో ఆస్ట్రోనాట్​గా అయ్యే అవకాశాన్ని కల్పించారు. ట్రైనింగ్​ దశలో భాగంగా తొలుత జాన్​ మెక్​ ఫాల్​ యూరోపియన్​ స్పేస్​ ఏజెన్సీకి చెందిన ఇంజనీర్లతో కలిసి పనిచేస్తాడు. రోదసీ యాత్రతో ముడిపడిన సాంకేతిక, నిర్వహణపరమైన అంశాలపై కొంచెం కొంచెంగా అవగాహన పెంచుకుంటాడు.