40 ఏండ్ల తర్వాత బద్దలైన మౌనా లోవా అగ్నిపర్వతం

40 ఏండ్ల తర్వాత బద్దలైన మౌనా లోవా అగ్నిపర్వతం

వాషింగ్టన్‌ : ప్రపంచంలో అతిపెద్ద అగ్నిపర్వతం బద్ధలైంది. హవాయిలోని మౌనా లోవా అగ్నిపర్వతం దాదాపు 40ఏండ్ల తర్వాత బద్ధలైంది. భారీగా లావా, బూడిదను వెదజల్లుతోంది. ఆదివారం అగ్నిపర్వతం బద్దలవగా.. ఇప్పటికీ లావా ఎగజిమ్ముతోంది. దాదాపు 33 మీటర్ల నుంచి200 మీటర్ల ఎత్తు వరకు లావా ఎగిసిపడుతోంది. అగ్ని పర్వత పరిసర ప్రాంతాలన్నీ బూడిదతో నిండిపోయారు. ఈ నేపథ్యంలో హవాయి కౌంటీ సివిల్ డిఫెన్స్ ఏజెన్సీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. లావా ప్రవాహం కొండ ప్రాంతంలోనే ఉందని, ఎవరూ భయపడాల్సిన అవసరం లేదంటూ అలెర్ట్‌ను ఉపసంహరించుకుంది. అయితే లావా ప్రవాహంలో వేగంగా మార్పులు జరగవచ్చని, ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని నిపుణులు హెచ్చరించారు.

విస్ఫోటనానికి ముందు మౌనా లోవా చుట్టూ వరుస భూకంపాలు వచ్చాయి. రిక్టర్‌ స్కేల్‌పై 3.0 కంటే తక్కువ తీవ్రతతో 18 భూకంపాలు సంభవించాయి. మౌనా లోవా హవాయి గొలుసులో దక్షిణ చివరలో ఉంది. మౌనా లోవా అగ్నిపర్వతం సముద్ర మట్టానికి 13,670 అడుగుల ఎత్తులో ఉంది. ఇది గతంలో 1950లో విస్ఫోటనం చెందింది. అప్పుడు ఎగజిమ్మిన లావా కేవలం 3 గంటల్లోనే 5 మైళ్ల దూరం ప్రయాణించింది. మౌనాలోవా చివరగా1984లో చివరగా 20 రోజుల పాటు లావా వెదజల్లింది.