ఒక్క వారంలో నమోదైన హయ్యెస్ట్​ కేసులు ఇవే

ఒక్క వారంలో నమోదైన హయ్యెస్ట్​ కేసులు ఇవే


న్యూఢిల్లీ: ప్రపంచంలో పోయిన వారం భారీగా కరోనా కేసులు నమోదయ్యాయి. 2.1 కోట్ల మంది మహమ్మారి బారిన పడ్డారని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్​వో) వెల్లడించింది. మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటిదాకా ఒక్క వారంలో నమోదైన హయ్యెస్ట్​ కేసులు ఇవేనని పేర్కొంది. అంతేకాదు.. చాలా దేశాల్లో ఒమిక్రాన్​ కమ్యూనిటీ స్ప్రెడ్​ మొదలైపోయిందని హెచ్చరించింది. డెల్టాతో పోలిస్తే ఒమిక్రాన్​ సోకే రేటు ఎక్కువని, దీంతో ఇప్పుడు డెల్టాతో పోలిస్తే ఒమిక్రాన్​ కేసులే ఎక్కువగా వస్తున్నాయని వివరించింది. అంతకుముందు వారంతో పోలిస్తే పోయిన వారం కరోనా కేసులు 5 శాతం పెరిగాయని చెప్పింది. జనవరి 23 వరకు 34.6 కోట్ల కేసులు, 55 లక్షల కరోనా మరణాలు రికార్డయ్యాయని వివరించింది. అయితే, అమెరికా తప్ప పలు ప్రపంచదేశాల్లో కరోనా కేసులు పెరిగిపోతున్నట్టు డబ్ల్యూహెచ్​వో హెచ్చరించింది. అమెరికాలో గత వారం 42,15,852 కరోనా కేసులు నమోదుకాగా.. అంతకుముందు వారంతో పోలిస్తే 24 శాతం తగ్గాయని చెప్పింది. ఆ తర్వాత ఫ్రాన్స్​ లో 24,43,821 కొత్త కేసులతో ఫ్రాన్స్​ రెండో స్థానంలో ఉందని తెలిపింది. ఆ దేశంలో కేసులు 21% పెరిగాయని వెల్లడించింది.