20 లక్షలకు చేరువైన కేసులు

20 లక్షలకు చేరువైన కేసులు

వాషింగ్టన్: ప్రపంచవ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య 20 లక్షలకు చేరువైంది. మంగళవారం నాటికి అన్ని దేశాల్లోకలిపి 19,79,853 కేసులు నమోదయ్యా యి. వైరస్ మొత్తం 1,24,918 మందిని బలితీసుకుంది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 4.60 లక్షల మంది కోలుకున్నారు. ఇప్పటికీ చాలా దేశాల్లో వైరస్ ముప్పు ఇంకా తొలగిపోలేదని నిపుణులు చెప్తున్నారు. కొన్ని దేశాల్లోవైరస్ ఇంకా పీక్ స్టే జ్ కు కూడా వెళలేద్ల ని అంటున్నారు.

స్కూళ్లలో కంప్యూటర్లు ఎత్తుకెళ్తున్నరు..

సౌతాఫ్రికాలో లాక్ డౌన్ వల్లదొంగలు వైన్ షాపులు, స్కూళపై   పడుతున్నరు. మందు, డ్రగ్స్ కొనుక్కోవడం కోసం స్కూళ్లలో కంప్యూటర్లు ఎత్తుకెళ్లి అమ్ముకుంటున్నరు. దేశంలో 183 స్కూళ్లలో చోరీలు జరిగాయనిఅధికారులు వెల్లడించారు. వెస్టర్న్ కేప్ ప్రావిన్స్ లోనే 16 వైన్ షాపులలో చోరీలు జరిగాయని తెలిపారు. టర్కీలో వేలాది ఖైదీల రిలీజ్.. జైళ్లలో రద్దీ వల్ల కరోనా ముప్పు ఇంకా పెరిగే ఛాన్స్ ఉండటంతో ఖైదీలను విడుదల చేసేందుకు టర్కీ చట్టాన్ని తీసుకొచ్చింది. హంతకులు, లైంగిక నేరస్తులు, డ్రగ్స్ నేరాలకు పాల్పడినవారిని ఈ చట్టంలో చేర్చలేదు. ప్రీ ట్రయల్ ఖైదీలుగా ఉన్న జర్నలిస్టులు, పొలిటీషియన్స్, లాయర్ల విడుదలకు ఇందులో ప్రతిపాదనలు లేకపోవడాన్ని మానవ హక్కుల సంఘాలు తప్పుపట్టాయి. పసికందులకు ఫేస్ షీల్డులు.. శిశువులకు కరోనా సోకకుండా థాయ్ లాండ్ డాక్టర్లు పుట్టిన ప్రతి బిడ్డకూ ఫేస్ షీల్డును అమర్చుతున్నారు. ఇంటికి కూడా ఈ ఫేస్ షీల్డుతోనే పంపుతున్నారు. రష్యా నుంచి వస్తున్న చైనీయుల వల్ల చైనాలో మళ్లీ కరోనా కేసులు పెరిగిపోతున్నందున రష్యాతో బోర్డర్ ను బంద్ ను చైనా కొనసాగిస్తోంది.బోర్డర్  సిటీల్లో లాక్ డౌన్ ను స్ట్రిక్టు చేసింది. పాకిస్తాన్ లో హిందువులు, క్రైస్తవులకు ఫుడ్ ఇవ్వడానికి నిరాకరిస్తున్నారన్న వార్తలు వస్తున్నాయని, ఇది సరికాదని యూఎస్ కమిషన్ ఆన్ ఇంటర్నేషనల్ ఫ్రీడం కమిషనర్ అరుణిమ బార్గవ్ అన్నారు. మతం ఆధారంగా ఆహారాన్ని  నిరాకరించొద్దని ప్రభుత్వానికి సూచించారు. కరోనా వైరస్ ను బీసీజీ టీకా నివారిస్తుందనేందుకు ఎలాంటి ఆధారాలు లేవని డబ్ల్యూహెచ్ఓ మంగళవారం స్పష్టంచేసింది. అందుకే కరోనా నివారణకు బీసీజీ టీకాలు వేయాలన్న ప్రతిపాద నలను తిరస్కరిస్తున్నట్లు వెల్ల డించింది. బ్రిటన్ లో నేషనల్ హెల్త్ సర్వీస్ కు చెందిన డాక్టర్లకు , నర్సులు, ఇతర సిబ్బందిలో ఒకటింట మూడొంతుల మందికి కరోనా సోకింది.