వేడుక ఇలానా : క్యాడ్బరీ చాక్లెట్లో పురుగు

వేడుక ఇలానా : క్యాడ్బరీ చాక్లెట్లో పురుగు

క్యాడ్బరీ చాక్లెట్.. పెద్దలే కాదు పిల్లలు ఇష్టంగా తినేది.. తియ్యని వేడుక ఏది అయినా క్యాడ్బరీ ఉండాలనే కాన్సప్ట్ తో మార్కెటింగ్ చేస్తుంది ఈ కంపెనీ.. యూత్ అయితే తెగ తినేస్తుంటారు.. ఇంట్లో ఫ్రిడ్జ్ లో ఉండే చాక్లెట్లలో క్యాడ్బరీ ఒకటి.. అలాంటి ఈ చాక్లెట్ లో పురుగు వచ్చింది.. అది బతికే ఉంది.. ఇది కూడా హైదరాబాద్ లోని ఓ సూపర్ మార్కెట్ లో కొనుగోలు చేసిన చాక్లెట్ లో కనిపించింది. ఈ విషయాన్ని ఓ నెటిజన్ తన ఎక్స్ (ట్విట్టర్) అకౌంట్ లో పోస్టు చేయటంతో వెలుగులోకి వచ్చింది.. ఆ పూర్తి వివరాలు చూద్దాం.

రాబిన్ జాకీయస్ అనే వ్యక్తి తన ట్విట్టర్లో ఓ వీడియో పోస్ట్ చేశారు.  క్యాడ్‌బరీ డైరీ మిల్క్ చాక్లెట్‌పై  పురుగు పాకుతున్నట్లు ఈ వీడియోలు కనిపిస్తోంది.  అతను ఈ చాక్లెట్ ను  హైదరాబాద్‌ అమీర్‌పేట్ మెట్రో ఇంటర్ ఛేంజ్ స్టేషన్ లోని   ఓ సూపర్ మార్కెట్ లో  కొనుగోలు చేసినట్లు బిల్ ఫోటోను కూడా షేర్ చేశాడు. 

అసలు ఎక్స్ప్ పరీ ముగిసిన వస్తువుల్లో క్వాలీటీ ఉందా.? ప్రజల ఆరోగ్యానికి ఎవరు బాధ్యత వహిస్తారు?అని  ట్విట్టర్ లో   ప్రశ్నించారు. దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని అతడు జీహెచ్ఎంసీకి ఫిర్యాదు చేశాడు. దీంతో  స్పందించిన జీహెచ్ఎంసీ తక్షణమే చర్యలు తీసుకోవాలని ఫుడ్ సెక్యూరిటీ బృందాన్ని ఆదేశించింది.