
మీరు ఈ వర్షాకాలంలో విభిన్నంగా ఏదైనా ప్రయత్నించాలని చూస్తున్నారా? అది AK47 సోడా కావచ్చు.. ఓ సారి ట్రై చేయండి. దీని గురించి తెలిస్తే మీరు కనీసం ఒక్కసారైనా ఈ డ్రింక్ ను ప్రయత్నించాలని అనుకుంటారు.
AK47 సోడా గురించి
రైఫిల్‌లో బుల్లెట్‌లను లోడ్ చేయడం మాదిరిగానే, ఈ సోడాలో నిమ్మకాయ షాట్లు ఉంటాయి. స్ట్రీట్ ఫుడ్ విక్రయించే ఓ వ్యాపారి తన వాయిస్ మాడ్యులేషన్‌తో వారికి AK47 సోడాను సిప్ చేయడంలో అత్యుత్తమ అనుభవాన్ని అందించేందుకు ఈ సోడాను తయారు చేస్తున్నాడు. కస్టమర్‌ల దృష్టిని ఆకర్షించడానికి, గొప్ప వైబ్ సృష్టించడానికి ఫంకీ పేర్లతో తరచుగా సోడాను అందిస్తానని చెబుతున్నాడు.
వీడియో వైరల్
ఓ ఫుడ్ వ్లాగర్ ఈ ప్రత్యేక సోడాకు సంబంధించిన వీడియోను కొన్ని రోజుల క్రితం ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. పోస్టు చేసిన కొద్దిసేపటికే, కంటెంట్-షేరింగ్ ప్లాట్‌ఫారమ్‌లో ఇది వేలాది వ్యూస్, లైక్ లను సొంతం చేసుకుంది. ఈ వీడియో గుజరాత్‌లోని అహ్మదాబాద్ కు చెందినట్టుగా తెలుస్తోంది.