? WPL Auction Live updates : ఇప్పటివరకు 34 మందిపై రూ.43,75 కోట్లు

? WPL Auction Live updates : ఇప్పటివరకు 34 మందిపై రూ.43,75 కోట్లు

వేలంలో టీమిండియా స్టార్ ప్లేయర్ స్మృతీ మంధానా అత్మధిక ధర పలికింది. మంధాన కోసం ముంబై, ఆర్సీబీ జట్లు పోటీ పడగా రూ. 3.40 కోట్లకు ఆర్సీబీ దక్కించుకుంది. 

టీమిండియా కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్‌‌ని రూ. 1.80 కోట్లకు ముంబై దక్కించుకుంది. హర్మన్ కోసం ముంబై, యూపీ వారియర్స్ పోటీ పడ్డాయి.

ఆస్ట్రేలియా క్రికెటర్స్ ఆష్లీ గార్డనర్‌‌ను రూ. 3.20 కోట్లకు గుజరాత్ జెయింట్స్‌ సొంతం చేసుకుంది. మరొక ఆసీస్ ప్లేయర్ ఎలిస్ పెర్రీని రూ.1.70 కోట్లకు ఆర్సీబీ దక్కించుకుంది. 

న్యూజిలాండ్ క్రికెటర్ సోఫీ డివైన్‌ కనీస ధర రూ.50 లక్షలకు ఆర్సీబీ సొంతం చేసుకుంది. ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ సోఫీ ఎక్లెస్టోన్‌ కోసం యూపీ వారియర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ పోటీపడగా రూ.1.80 కోట్లకు యూపీ వారియర్స్ సొంతం చేసుకుంది.

రెండో సెట్‌లో టీమిండియా బౌలర్ దీప్తి శర్మ భారీ ధర పలికింది. తనను కొనుగోలు చేసేందుకు ముంబై, ఢిల్లీ, గుజరాత్, యూపీ జట్లు పోటీ పడ్డాయి. చివరికి రూ.2.60 కోట్లకు యూపీ వారియర్స్ సొంతం చేసుకుంది. భారత పేస్ బౌలర్ రేణుక సింగ్‌ని ఆర్సీబీ రూ.1.50 కోట్లకు దక్కించుకుంది. 

ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ సోఫీ ఎక్లెస్టోన్‌ ను రూ.1.80 కోట్లకు, ఆసీస్ ఆల్‌రౌండర్ తహ్లియా మెక్‌గ్రాత్‌ను రూ. 1.40 కోట్లకు, ఇంగ్లండ్ బ్యాటర్ సోఫియా డంక్లీని రూ. 60 లక్షలకు యూపీ వారియర్స్ జట్టు సొంతం చేసుకుంది.

ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కూడా టీమిండియా బ్యాటర్ జెమియా రోడ్రిగ్స్‌కు భారీ మొత్తాన్ని చెల్లించింది. తనను రూ. 2.20 కోట్లకు దక్కించుకుంది.

ఆసీస్ బ్యాటర్ బెత్ మానీని గుజరాత్ జెయింట్స్‌ రూ.2 కోట్లకు సొంతం చేసుకుంది. సౌతాఫ్రికా బౌలర్‌‌ షబ్నిమ్ ఇస్మాయిల్‌ను యూపీ రూ. కోటికి దక్కించుకుంది. కివీస్ ఆల్‌రౌండర్‌‌ అమేలియా కెర్‌‌ను రూ. కోటికి ముంబై సొంతం చేసుకుంది. 

మూడో సెట్ లో ఆసీస్ ఆల్ రౌండర్ అన్నాబెల్ సదర్లాండ్ ను యూపీ వారియర్స్ రూ. 70 లక్షలకు దక్కించుకుంది.

టీమిండియా అల్‌రౌండర్‌‌ పూజా వస్త్రాకర్‌‌ ను ముంబై రూ.1.90 కోట్లకు కొనుగోలు చేసింది. విండీస్ ఆల్‌రౌండర్‌‌ డాటిన్‌ను రూ.60 లక్షలకు గుజరాత్‌ జెయింట్స్‌ సొంతం చేసుకుంది. టీమిండియా బ్యాటర్‌‌ యాస్తికా భాటియాను ముంబై రూ. 1.50 కోట్లకు సొంతం చేసుకుంది. 
  
టీమిండియా వికెట్ కీపర్స్ రిచా ఘోష్ ను ఆర్సీబీ రూ.1,90 కోట్లకు కొనుగోలు చేసింది. ఆసీస్ వికెట్ కీపర్ అలిస్సా హీల్ ను రూ.70 లక్షలకు,  టీమిండియా లెఫ్ట్ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ అంజలి శర్వణిని రూ.55 లక్షలకు యూపీ సొంతం చేసుకుంది. 

అమ్ముడు పోని ప్లేయర్లు

టీమిండియా వికెట్ కీపర్ సుష్మా వర్మ, ఇంగ్లండ్ కీపర్ అమీ జోన్స్, కివీస్ కీపర్ బెర్నాడిన్ లను కొనేందుకు ఏ ఫ్రాంచేజీ ఆసక్తి చూపలేదు. మేగాన్, అలానా కింగ్  (ఆసీస్), జహనారా (బంగ్లాదేశ్), లీ తహుహు (కివీస్), ఆయబొంగ ఖాకా, మ్లాబా  (సౌతాఫ్రికా), షకీరా సెల్మన్, అఫీ ఫ్లెచర్ (విండీస్), సారా గ్లెన్ (ఇంగ్లండ్), పూనమ్ యాదవ్ (భారత్), ఫ్రాన్ జోనాస్ (కివీస్), ఇనోకా రణవీర (శ్రీలంక) ప్లేయర్లు వేలంలో అమ్ముడుపోలేదు. టీమిండియా ఆల్ రౌండర్ మన్నత్ కశ్యప్. నజ్లా సీఎంసీ, సోనమ్ యాదవ్, ఆల్ రౌండర్ సోనియా మెందియా, ఫలక్ నాజ్, షబ్నమ్ షకిల్, షోర్నా అక్తెర్ (బంగ్లాదేశ్), షికా షాలోత్ లకు వేలంలో నిరాశ ఎదురైంది.

భారత పేసర్ రాజేశ్వరి గైక్వాడ్ ను రూ.40 లక్షలకు యూపీ కొనుగోలు చేసింది. ఆల్ రౌండర్ రాధా యాదవ్ ని రూ.40 లక్షలకు, పేసర్ శిఖా పాండేను రూ.60 లక్షలకు  ఢిల్లీ క్యాపిటల్స్ సొంతం చేసుకుంది. ఎస్. యశశ్రీని రూ.10 లక్షలకు యూపీ కొనుగోలు చేసింది.

ఏ జట్టు దగ్గర ఎంతుందంటే..

ఢిల్లీ-6.7 కోట్లు
గుజరాత్ జెయింట్స్-4.5 కోట్లు
ముంబై ఇండియన్స్-2.6 కోట్లు
ఆర్సీబీ-3 కోట్లు
యూపీ వారియర్స్-3.55 కోట్లు

టీమిండియా ఆల్ రౌండర్ స్నేహా రాణాను గుజరాత్ రూ. 75 లక్షలకు, అండర్-19 లెగ్ స్పిన్నర్ ప్రశవి చోప్రాను యూపీ రూ. 10 లక్షలకు సొంతం చేసుకుంది. సౌతాఫ్రికా ఆల్ రౌండర్ మారిజానేను ఢిల్లీ రూ. 1.50 కోట్లకు దక్కించుకుంది. బౌలర్ టిటాస్ సాధును ఢిల్లీ రూ.25 లక్షలకు సొంతం చేసుకుంది. టీమిండియా అండర్ 19 వైస్ కెప్టెన్ శ్వేతా సెహ్రావత్ ను యూపీ రూ. 40 లక్షలకు కొనుగోలు చేసింది.  

తెలుగమ్మయికి నిరాశ

హైదరాబాద్ కు చెందిన అండర్ 19 ప్లేయర్ జి. త్రిషకు వేలంలో నిరాశ ఎదురైంది. రూ.10 లక్షల బేస్ ప్రైజ్ ఉన్న తనను కొనుగోలు చేయడానికి ఎవరూ ఆసక్తి చూపలేదు.

వేలంలో రూ.43,75 కోట్లు ఖర్చు చేశారు

ఇప్పటివరకు జరిగిన వేలంలో ఐదు జట్లు మొత్తం 34 మంది ప్లేయర్లని కొనుగోలు చేశాయి. ఆ 34 మందిపై అన్ని ఫ్రాంచేజీలు కలిపి రూ.43,75,00,000 కోట్లు ఖర్చు పెట్టాయి. 

కోట్లు కొల్లగొట్టింది వీళ్లే..

స్మృతి మందాన- రూ.3,40,000 కోట్లు
ఆష్లే గార్డ్ నర్ -రూ.3,20,000 కోట్లు
నటాలీ స్కివర్- రూ.3,20,000 కోట్లు
దీప్తి శర్మ- రూ.2,60,000 కోట్లు
జెమీమా రోడ్రిగ్స్ -రూ.2,20,000 కోట్లు

వేలానికి మిగిలి ఉన్న డబ్బు..

ఢిల్లీ క్యాపిటల్స్ -రూ.3,95,00,000 కోట్లు
గుజరాత్ జెయింట్స్- రూ.3,75,00,000 కోట్లు
ముంబై ఇండియన్స్- రూ.2,60,00,000 కోట్లు
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు- రూ.3,00,00,000 కోట్లు
యూపీ వారియర్స్- రూ.2,95,00,000 కోట్లు