ఢిల్లీ vs ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీబీ..ఇయ్యాల డబ్యూపీఎల్‌‌‌‌‌‌‌‌  మెగా ఫైనల్

ఢిల్లీ vs ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీబీ..ఇయ్యాల డబ్యూపీఎల్‌‌‌‌‌‌‌‌  మెగా ఫైనల్
  •     ఢిల్లీ క్యాపిటల్స్‌‌‌‌‌‌‌‌తో ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీబీ ఢీ
  •     రా. 7.30 నుంచి స్పోర్ట్స్‌‌‌‌‌‌‌‌18, జియో సినిమాలో

న్యూఢిల్లీ : ఉత్కంఠ పోరాటాలతో అభిమానులను అలరిస్తున్న విమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్‌‌‌‌‌‌‌‌) రెండో సీజన్‌‌‌‌‌‌‌‌ క్లైమాక్స్‌‌‌‌‌‌‌‌కు చేరుకుంది. స్టార్టింగ్‌‌‌‌‌‌‌‌ నుంచే అద్భుత ఆటతో అదరగొట్టి టాప్ ప్లేస్‌‌‌‌‌‌‌‌తో వరుసగా రెండోసారి ఫైనల్‌‌‌‌‌‌‌‌కు వచ్చిన ఢిల్లీ క్యాపిటల్స్‌‌‌‌‌‌‌‌.. పడుతూ లేస్తూ ముందుకొచ్చి  ఎలిమినేటర్‌‌‌‌‌‌‌‌లో డిఫెండింగ్‌‌‌‌‌‌‌‌ చాంపియన్‌‌‌‌‌‌‌‌ ముంబై ఇండియన్స్‌‌‌‌‌‌‌‌ పని పట్టిన రాయల్‌‌‌‌‌‌‌‌ చాలెంజర్స్‌‌‌‌‌‌‌‌ బెంగళూరు (ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీబీ) ఆదివారం జరిగే మెగా ఫైనల్‌‌‌‌‌‌‌‌ ఫైట్‌‌‌‌‌‌‌‌లో అమీతుమీకి రెడీ అయ్యాయి.

గత సీజన్‌‌‌‌‌‌‌‌లో ముంబై చేతిలో ఓడి రన్నరప్‌‌‌‌‌‌‌‌గా నిలిచిన ఢిల్లీ ఈసారి కప్పును ఒడిసిపట్టుకోవాలని డిసైడైంది. సొంత గడ్డపై తుది పోరు ఆ జట్టుకు ప్లస్ పాయింట్ కానుంది. ఇంకోవైపు పలువురు స్టార్లతో నిండిన ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీబీ తమ తొలి ఫైనల్లోనే టైటిల్‌‌‌‌‌‌‌‌ అందుకోవాలని చూస్తోంది.  మరి ఆఖరాటలో ఎవరిది పైచేయి అవుతుందో చూడాలి.

ఫేవరెట్‌‌‌‌‌‌‌‌గా ఢిల్లీ

ఈ సీజన్‌‌‌‌‌‌‌‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌‌‌‌‌‌‌‌ సూపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫామ్‌‌‌‌‌‌‌‌లో ఉంది. లీగ్‌‌‌‌‌‌‌‌ దశలో ఎనిమిది మ్యాచ్‌‌‌‌‌‌‌‌ల్లో ఆరింటిలో నెగ్గిన ఆ జట్టు 12 పాయింట్లతో టాప్ ప్లేస్ సాధించింది. దాంతో నేరుగా ఫైనల్‌‌కు వచ్చింది. కెప్టెన్ మెగ్‌‌‌‌‌‌‌‌ లానింగ్‌‌‌‌‌‌‌‌ డీసీని ముందుండి నడిపిస్తోంది. ఎనిమిది ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌ల్లో 308 రన్స్‌‌‌‌‌‌‌‌తో మంచి ఫామ్‌‌‌‌‌‌‌‌లో ఉంది. సౌతాఫ్రికా ఆల్‌‌‌‌‌‌‌‌రౌండర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మరిజానె కాప్‌‌‌‌‌‌‌‌, ఆస్ట్రేలియా లెఫ్టార్మ్‌‌‌‌‌‌‌‌ స్పిన్నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జెస్ జొనాసెస్‌‌‌‌‌‌‌‌ చెరో 11 వికెట్లతో ఢిల్లీ తరఫున సత్తా చాటుతున్నారు. ఈ సీజన్‌‌‌‌‌‌‌‌లో ఢిల్లీ రెండు ఓటములు ముంబై ఇండియన్స్‌‌‌‌‌‌‌‌ చేతిలోనే ఎదురయ్యాయి. ఆ రెండింటిని తప్పిస్తే మిగతా అన్ని మ్యాచ్‌‌‌‌‌‌‌‌ల్లోనూ డీసీ పర్ఫెక్ట్‌‌‌‌‌‌‌‌ ఆటతో మెప్పించింది.

రెండు సీజన్లలో ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీబీతో ఆడిన నాలుగు మ్యాచ్‌‌‌‌‌‌‌‌ల్లోనూ ఢిల్లీ విజయం సాధించింది. దాంతో ఫైనల్లో డీసీ ఫేవరెట్‌‌‌‌‌‌‌‌గా బరిలోకి దిగనుంది. అయితే, గత విజయాలు ఫైనల్లో పెద్దగా ప్రభావం చూపే అవకాశం ఉండదు. మ్యాచ్‌‌ రోజున ఒత్తిడిని తట్టుకొని, అంచనాలు అందుకునే జట్టునే విజయం వరిస్తుంది. ఈ నేపథ్యంలో తమ డ్యాషింగ్ ఓపెనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ షెఫాలీ వర్మ.. లానింగ్‌‌‌‌‌‌‌‌తో కలిసి మంచి ఆరంభం ఇవ్వాలని ఢిల్లీ కోరుకుంటోంది. 

మిడిలార్డర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో జెమీమా రోడ్రిగ్స్‌‌‌‌‌‌‌‌ టచ్‌‌‌‌‌‌‌‌లోనే ఉన్నా.. ఆల్‌‌‌‌‌‌‌‌రౌండర్స్‌‌‌‌‌‌‌‌ ఎలైస్ క్యాప్సీ, కాప్‌‌‌‌‌‌‌‌ బ్యాట్‌‌‌‌‌‌‌‌తో   రాణించాలని లానింగ్‌‌‌‌‌‌‌‌ ఆశిస్తోంది. బౌలింగ్‌‌‌‌‌‌‌‌లో జొనాసెన్‌‌‌‌‌‌‌‌ స్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పెర్ఫార్మర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఉంది. కాప్‌‌‌‌‌‌‌‌ కూడా రాణిస్తుండగా  సీనియర్ పేసర్ శిఖా పాండే సైతం సత్తా చాటాల్సిన అవసరం ఉంది. లెఫ్టార్మ్ స్పిన్నర్ రాధా యాదవ్ 10 వికెట్లు సాధించి లీగ్‌‌‌‌‌‌‌‌ మ్యాచ్‌‌‌‌‌‌‌‌ల్లో జట్టు విజయాల్లో కీలకం అయింది.  ఢిల్లీలోని స్లో వికెట్‌‌‌‌‌‌‌‌పై హోమ్‌‌‌‌‌‌‌‌ టీమ్‌‌‌‌‌‌‌‌ స్పిన్నర్లపై ఎక్కువ ఆధారపడనుంది. 

అందరూ రాణిస్తేనే

లీగ్‌‌‌‌‌‌‌‌ దశలో ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీబీ మూడో స్థానంలో నిలిచి నాకౌట్‌‌‌‌‌‌‌‌ చేరుకుంది. ఎనిమిది మ్యాచ్‌‌‌‌‌‌‌‌ల్లో నాలుగే గెలిచిన ఆ జట్టు కీలక మ్యాచ్‌‌‌‌‌‌‌‌ల్లో  మాత్రం అద్భుతంగా ఆడుతోంది. ఎలిమినేటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ముంబై పని పట్టడమే అందుకు ఉదాహరణ. ఆల్‌‌‌‌‌‌‌‌రౌండర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎలైస్ పెర్రీ ఆ టీమ్‌‌‌‌‌‌‌‌కు బ్యాక్ బోన్‌‌‌‌‌‌‌‌గా ఉంది. టోర్నీలో 312 రన్స్‌‌‌‌‌‌‌‌తో టాప్ స్కోరర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఉన్న పెర్రీ సూపర్ పెర్ఫామెన్స్‌‌‌‌‌‌‌‌ వల్లే ఎలిమినేటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ముంబైపై బెంగళూరు గెలిచింది. ఏడు వికెట్లు కూడా పడగొట్టిన ఆ స్టార్ ఆల్‌‌‌‌‌‌‌‌రౌండర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లీగ్‌‌‌‌‌‌‌‌లో తనదైన ముద్ర వేసింది. అయితే, ఫైనల్లో పెర్రీకి తోడు కెప్టెన్‌‌‌‌‌‌‌‌ మంధాన, సోఫీ డివైన్, రిచా ఘోశ్‌‌‌‌‌‌‌‌

సోఫీ మొలినుక్స్‌‌‌‌‌‌‌‌ బ్యాట్‌‌‌‌‌‌‌‌తో మెప్పించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా గత మూడు  ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌ల్లో 5, 11, 10 స్కోర్లతో ఫెయిలైన మంధాన బ్యాటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా టీమ్‌‌‌‌‌‌‌‌ను ముందుండి నడిపించాలి. ఇక బౌలింగ్‌‌‌‌‌‌‌‌లోనూ ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీబీ మెరుగవ్వాలి. స్టార్ పేసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రేణుకా సింగ్‌‌‌‌‌‌‌‌ ఈ సీజన్‌‌‌‌‌‌‌‌లో రెండే వికెట్లు పడగొట్టింది. గత ఏడు మ్యాచ్‌‌‌‌‌‌‌‌ల్లో ఒక్క వికెట్ కూడా తీయలేకపోయింది. కొత్త బాల్‌‌‌‌‌‌‌‌ బౌలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా తను ఆరంభంలోనే వికెట్లు పడగొట్టాల్సిన అవసరం ఉంది.  స్పిన్నర్ శ్రేయాంక ఆకట్టుకుంటోంది. డివైన్‌‌‌‌‌‌‌‌, వారెహమ్‌‌‌‌‌‌‌‌ కూడా రాణిస్తేనే ఢిల్లీకి ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీబీ గట్టి పోటీ ఇవ్వగలదు.