గల్లంతైన ఎయిర్ ఫోర్స్ విమానం ఆచూకి లభ్యం

గల్లంతైన ఎయిర్ ఫోర్స్ విమానం ఆచూకి లభ్యం

న్యూఢిల్లీ: కనిపించకుండా పోయిన ఎయిర్ ఫోర్స్ విమానం ఆచికి తెలిసింది. అరుణాచల్‌ ప్రదేశ్‌లోని సియాంగ్‌ జిల్లా పయూమ్‌ పరిధిలో కూలిపోయింది. కొద్ది రోజులుగా భారత ఎయిర్ ఫోర్స్ దళంతో పాటు, ఆర్మీ ఈ విమానం గురించి గాలింపు చర్యలు చేపట్టింది. ఎయిర్ ఫోర్స్ కి చెందిన MI-17 హెలికాప్టర్‌ సాయంతో విమానం ఆచూకీ కోసం వెతుకుతుండగా సియాంగ్‌ జిల్లాలో దీనిని గుర్తించారు.

జూన్‌ 3న మధ్యాహ్నం 12.25గంటలకు అసోంలోని జోర్హాట్‌ ఎయిర్ ఫోర్స్ స్థావరం నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే AS-32 విమానం కనిపించకుండా పోయింది. టెక్నికల్ గా ఎంత వెతికినా ఆచూకీ లభించలేదు. గల్లంతైన విమానం ఆచూకీ తెలిపిన వారికి రూ.5 లక్షల రూపాయల రివార్డు కూడా ప్రకటించింది వాయుసేన. విమానం అరుణాచల్‌ ప్రదేశ్‌లోని మారుమూల ఉన్న మెచుకా అడ్వాన్స్‌ ల్యాండింగ్‌ గ్రౌండ్‌కు చేరుకోవాల్సి ఉండగా, సియాంగ్‌ జిల్లా పయూమ్‌ పరిధిలో కూలిపోయింది. ఇందులో 8మంది సిబ్బంది, ఐదుగురు ఇతర ప్రయాణికులతో మొత్తం 13మంది ప్రయాణించారు.