
విలక్షణ పాత్రలతో టాలీవుడ్ నుండి బాలీవుడ్ వరకూ నటిగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును అందుకుంది టబు. నైంటీస్‌లో కెరీర్ స్టార్ట్ చేసిన ఆమె.. యాభై రెండేళ్ల వయసులోనూ వరుస ఆఫర్స్‌తో బిజీగా ఉంది. తాజాగా ఇప్పుడో హాలీవుడ్ సిరీస్‌లో నటించే అవకాశం అందుకుంది. హాలీవుడ్ వెబ్ సిరీస్ ‘డ్యూన్: ప్రాఫెసీ’లో టబు నటించబోతోంది. ఇందులో సిస్టర్ ఫ్రాన్సెస్కా అనే కీలకపాత్రను ఆమె పోషించబోతోంది. ఒకప్పుడు చక్రవర్తి ప్రేయసిగా ఉన్న ఆమె.. తిరిగి కోటకు రావడంతో ఈ సిరీస్ కథ మొదలవబోతోంది.
తెలివి, అందం కలగలిసిన పవర్‌ఫుల్ క్యారెక్టర్ ఇదని సమాచారం. నిజానికి 2019లోనే ‘డ్యూన్: సిస్టర్ హుడ్’ పేరుతో ఈ సిరీస్‌ను ప్రకటించారు. ‘సిస్టర్ హుడ్ ఆఫ్ డ్యూన్’ అనే నవల ఆధారంగా దీన్ని తెరకెక్కిస్తున్నారు. పాపులర్ రైటర్ ఫ్రాంక్ హెర్బర్ట్ క్రియేట్ చేసిన ‘డ్యూన్’ వరల్డ్‌లో ఈ సిరీస్‌ను నిర్మిస్తున్నారు. రెండు భాగాలుగా ‘డ్యూన్’ సినిమాలు రాగా మూడో సినిమా కూడా తెరకెక్కుతోంది.
ఇప్పుడు సిరీస్ కూడా తెరకెక్కుతోంది. మనిషి మనుగడకు ముప్పు తెచ్చే శక్తులతో హర్కోనెన్ సిస్టర్స్ ఎలా పోరాడారనే కాన్సెప్ట్‌తో ఈ సిరీస్‌ను తెరకెక్కిస్తున్నారు. ఇక గతంలోనూ ‘లైఫ్ ఆఫ్ పై’ లాంటి ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్స్‌లో టబు నటించింది.