రియలిస్టిక్‌‌‌‌‌‌‌‌గా రాజు యాదవ్

రియలిస్టిక్‌‌‌‌‌‌‌‌గా రాజు యాదవ్

గెటప్ శ్రీను హీరోగా నటించిన చిత్రం ‘రాజు యాదవ్’. కృష్ణమాచారి దర్శకత్వంలో  ప్రశాంత్ రెడ్డి , రాజేష్ కల్లెపల్లి నిర్మించారు. మే 17న సినిమా విడుదలవుతోన్న సందర్భంగా దర్శకుడు కృష్ణమాచారి మాట్లాడుతూ ‘మాది మహబూబ్ నగర్. 15 ఏళ్ల క్రితం ఇండస్ట్రీకి వచ్చా. నీది నాది ఒకే కథ, విరాటపర్వం చిత్రాలకు దర్శకుడు వేణు ఉడుగుల  దగ్గర అసోసియేట్ డైరెక్టర్‌‌‌‌‌‌‌‌గా చేశా.  దర్శకుడిగా ఇది నా తొలి చిత్రం. ఇదొక డిఫరెంట్ స్టోరీ.  దాదాపు 90శాతం మనుషుల్లో ఎదో ఒక చిన్న లోపం ఉంటుంది. ఈ కథకు కూడా ఒక లోపం ఉన్న పాత్ర కావాలి.

 వెరీ పెర్ఫార్మెన్స్ బేస్డ్ క్యారెక్టర్ ఇది. కథ రాసుకున్న తర్వాత ఒకరిద్దరి హీరోలతో వర్క్ షాప్ నిర్వహించాం. ఎందుకో నాకు నమ్మకం కుదరలేదు. పాత్రలో జీవిస్తున్నట్లు అనిపించలేదు. గెటప్ శ్రీను ఈ పాత్రకు పర్ఫెక్ట్ అనిపించారు. తను అన్ని రకాల పాత్రలను చేయగలడు. ఇందులో ఆయన జీవించారు. ఇది తన కెరీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనే  గుర్తుండిపోయే సినిమా అవుతుంది.

రియలిస్టిక్‌‌‌‌‌‌‌‌గా సాగే ఈ సినిమా అందరికీ కనెక్ట్ అవుతుంది. చంద్రబోస్ గారు లిరిక్స్ రాయడంతో పాటు ఆయనే స్వయంగా పాడిన పాట హైలైట్‌‌‌‌‌‌‌‌గా ఉంటుంది. హర్ష వర్ధన్ రామేశ్వర్ సంగీతంతో పాటు సురేష్​ బొబ్బిలి బ్యాక్‌‌‌‌‌‌‌‌గ్రౌండ్ స్కోరు  ఎమోషన్‌‌‌‌‌‌‌‌ని మరోస్థాయికి తీసుకెళుతుంది’ అని చెప్పాడు.