అర్థం అయ్యే భాషలో రాయండి : డాక్టర్లకు హైకోర్టు ఆదేశం

అర్థం అయ్యే భాషలో రాయండి : డాక్టర్లకు హైకోర్టు ఆదేశం

పోస్ట్‌మార్టం నివేదికలు, ప్రిస్క్రిప్షన్‌లను పెద్ద అక్షరాలతో రాయాలని ఒరిస్సా హైకోర్టు వైద్యులను ఆదేశించింది. పాముకాటు మృతి కేసులో నాన్‌లిజిబుల్‌ పోస్ట్‌మార్టం నివేదిక తర్వాత కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. రసానంద భోయ్ అనే వ్యక్తి తన కుమారుడు పాము కాటుతో మరణించినందున అతనికి పరిహారం అందించాలని రాష్ట్రాన్ని ఆదేశించాలని కోరుతూ రిట్ పిటిషన్ దాఖలు చేసిన వ్యాజ్యాన్ని కోర్టు విచారించింది. అన్ని వైద్య కేంద్రాలు, క్లినిక్‌లు, ఆసుపత్రులకు సరైన చేతిరాత గానీ, టైప్ చేసిన రూపంలో రాయడానికి సర్క్యులర్ జారీ చేయాలని ప్రధాన కార్యదర్శిని కోర్టు కోరింది.  

పోస్టుమార్టం రిపోర్టులు , ప్రిస్క్రిప్షన్‌లను క్యాపిటల్ లెటర్స్‌లో లేదా స్పష్టమైన చేతిరాతతో రాయాలని రాష్ట్రవ్యాప్తంగా వైద్యులకు ఆదేశాలు జారీ చేయాలని ఒరిస్సా హైకోర్టు ప్రధాన కార్యదర్శిని కోరింది. పోస్ట్‌మార్టం నివేదికను పరిశీలించిన తర్వాత జనవరి 4న హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అది స్పష్టంగా లేకపోవడంతో.. దానిపై వివరణ ఇవ్వడానికి వైద్యుడిని పిలిపించాల్సి వచ్చింది. పాముకాటు మరణం కేసులో ఈ రిపోర్టు వచ్చింది. నష్టపరిహారం కోసం చేసిన బాధితురాలి తండ్రి విజ్ఞప్తిని తహసీల్దార్‌ తిరస్కరించడంతో కోర్టు జోక్యం చేసుకోవాలని.. పిటిషన్‌ దాఖలు చేశారు.

చాలా కేసుల్లో చాలా మంది వైద్యులు పోస్ట్‌మార్టం నివేదిక రాసేటప్పుడు తమ హ్యాండ్ రైటింగ్ ను సరిగా ఉండేలా చూసుకోవాలని, న్యాయ వ్యవస్థలో తలెత్తుతోన్న సమస్యలను డాక్టర్ జస్టిస్ సంజీబ్ కుమార్ పాణిగ్రాహి ప్రస్తావించారు. సాధారణ వ్యక్తులు గానీ, న్యాయాధికారులు చదవలేని ఈ జిగ్ జాగ్ చేతిరాతను రాయడం వైద్యులలో ఒక ఫ్యాషన్‌గా మారిందని కోర్టు పేర్కొంది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని అన్ని మెడికల్ సెంటర్లు, ప్రైవేట్ క్లినిక్‌లు, మెడికల్ కాలేజీలు, ఆసుపత్రులకు సర్క్యులర్ జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. వారు మెడిసిన్ ను సూచించేటప్పుడు లేదా కొన్ని వైద్య-చట్టపరమైన రిపోర్టులను రాసేటప్పుడు చేతిరాత లేదా టైప్ చేసిన రూపంలో రిపోర్ట్ ఉండాలంది. అనంతరం డాక్టర్‌ను కోర్టులో హాజరుపరిచిన తర్వాత, ఒపీనియన్‌షీట్‌లోని విషయాలను డాక్టర్ చదివి వినిపించాడు., పిటిషనర్ కుమారుడు పాము కాటు వల్లే చనిపోయాడని కోర్టు నిర్ధారించి, పరిహారం మొత్తాన్ని కోరుతూ సంబంధిత తహసీల్దార్ ను సంప్రదించాలని ఆదేశించింది.