అన్నయ్య మిమ్మల్ని అనరాని మాటలు అన్నాను.. నన్ను క్షమించండి: చిన్ని కృష్ణ

అన్నయ్య మిమ్మల్ని అనరాని మాటలు అన్నాను.. నన్ను క్షమించండి: చిన్ని కృష్ణ

ప్రముఖ రచయిత చిన్ని కృష్ణ(Chinni Krishna) గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అవసరం లేదు. భారీ బడ్జెట్, పవర్ ఫుల్ కథలు అందించడంలో ఆయన ఫేమస్. ఇంద్ర, నరసింహనాయుడు వంటి బ్లాక్ బస్టర్ సినిమాను ఆయన కలం నుండి వచ్చినవే. అయితే.. ఆ తరువాత మాత్రం ఆ సక్సెస్ ను కంటిన్యూ చేయలేకపోయారు. కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న ఆయన తాజాగా ఒక వీడియో ద్వారా ఆడియన్స్ ముందుకు వచ్చారు. మెగాస్టార్ చిరంజీవికి పద్మా విభూషణ్ వచ్చిన సందర్బంగా ఆయన్ని కలిశానని, ఆయనని క్షమాపణలు కోరానని చెప్పుకొచ్చారు చిన్నికృష్ణ.

ఇక ఈ వీడియోలో చిన్ని కృష్ణ మాట్లాడుతూ.. చిరంజీవి అన్నయ్యకు పద్మ విభూషణ్ వచ్చిందని తెలిసి ఆయన్ని కలిసి హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలియజేసాను. ఈ భూమ్మీద పుట్టిన ప్రతీ ఒక్కరు తప్పులు చేయడం సహజం. నన్ను నమ్మి.. ఇంద్ర సినిమా అవకాశం ఇచ్చిన చిరంజీవి గారిని నానా మాటలు అన్నాను. ఒకానొక సమయంలో కొంత మంది నన్ను ప్రభావితం చేశారు. దాని వల్ల నా భార్యా, బిడ్డలు, సమాజం నన్ను ద్వేషించారు. ఆ క్షణం నుండి ఇప్పుడు మీతో మాట్లాడే వరకు ఎంతో మదనపడ్డాడు.

కలవడానికి అన్నయ్య ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన నన్ను బాగా రిసీవ్ చేసుకున్నారు. ఇలాంటి వ్యక్తి గురించా నేను తప్పుగా మాట్లాడింది అని వెంటనే క్షమించమని అడిగాను. ఆయన పెద్ద మనస్సుతో క్షమించడమే కాకుండా.. కథలేమైనా రాస్తున్నావా చిన్ని, ఉంటె చెప్పు కలిసి పనిచేద్దాం అన్నారు. అది విన్నాక అన్నయ్య ఇంకెప్పుడు ఎవరి గురించి తప్పుగా మాట్లాడను అంటూ మనస్పూర్తిగా మరొక్క సారి క్షమించమని అడిగాను. ఐ సామ్ సారీ మై డియర్ బ్రదర్.. అంటూ ఎమోషనల్ కామెంట్స్ చేశారు చిన్ని కృష్ణ. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.