రాంగ్ డ్రైవింగ్​పై స్పెషల్​ డ్రైవ్

రాంగ్ డ్రైవింగ్​పై స్పెషల్​ డ్రైవ్

మెహిదీపట్నం/సికింద్రాబాద్, వెలుగు: ట్రాఫిక్​పెరగడానికి రాంగ్​డ్రైవింగ్ కారణమవుతోందని సౌత్​వెస్ట్ జోన్ ట్రాఫిక్ డీసీపీ ఆర్.వెంకటేశ్వర్లు తెలిపారు. బుధవారం లంగర్ హౌస్, టోలిచౌకి, ఆసిఫ్ నగర్, గోషామహల్ ప్రాంతాల్లో స్పెషల్​డ్రైవ్​చేపట్టి, రాంగ్​రూట్​లో ప్రయాణిస్తున్న 250 వాహనదారులను పట్టుకున్నారు. వారికి గుడిమల్కాపూర్ రూపు గార్డెన్ లో కౌన్సిలింగ్ ఇచ్చారు. అలాగే ట్రాఫిక్​రూల్స్​బ్రేక్​చేస్తున్న వాహనదారులకు బుధవారం బేగంపేట ట్రాఫిక్ ట్రైనింగ్​ఇనిస్టిట్యూట్ లో కౌన్సిలింగ్​ఇచ్చారు.