ప్రతి యాక్షన్ వెనుక ఓ ఎమోషన్‌‌తో ‘బఘీర’

ప్రతి యాక్షన్ వెనుక ఓ ఎమోషన్‌‌తో ‘బఘీర’

శ్రీమురళి, రుక్మిణి వసంత్ జంటగా దర్శకుడు ప్రశాంత్ నీల్ అందించిన కథతో  డాక్టర్ సూరి రూపొందించిన  చిత్రం ‘బఘీర’. హోంబలే ఫిల్మ్స్ సంస్థ నిర్మించిన ఈ చిత్రం  అక్టోబర్ 31న విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు సూరి మాట్లాడుతూ ‘ఇది ఒక యువకుడి లైఫ్ జర్నీ.  ఒక మామూలు కుర్రాడు రియల్ లైఫ్‌‌లో సూపర్ హీరో అవ్వాలనుకుంటాడు. దాని కోసం తను ఏం చేశాడు..  సొసైటీకి మంచి చేశాడా, చెడు చేశాడా అనేది కథ. 

హీరో క్యారెక్టర్‌‌‌‌ను లార్జర్ దేన్ లైఫ్ తరహాలో డిజైన్ చేశాం. స్క్రీన్‌‌ప్లే చాలా గ్రిప్పింగ్‌‌గా ఉంటుంది.  అలాగే  ప్రతి క్యారెక్టర్ కథలో కీలకం.  మంచి ఎమోషనల్ హై ఇచ్చే సినిమా ఇది.  ప్రతి యాక్షన్ వెనుక ఎమోషన్ ఉంటుంది.  విజయ్ కిరగందూర్ నాకు ‘కేజీఎఫ్’ నుంచి పరిచయం. ఈ సినిమా విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించారు. కన్నడతో పాటు తెలుగు ప్రేక్షకులు కూడా ఈ చిత్రాన్ని ఆదరిస్తారనే నమ్మకం ఉంది’ అని చెప్పాడు.