X సేవలకు అంతరాయం .. గందరగోళంలో యూజర్లు

X సేవలకు అంతరాయం .. గందరగోళంలో యూజర్లు

ప్రముఖ మేసేజింగ్ యాప్ X(గతంలో ట్విట్టర్) సేవలకు అంతరాయం ఏర్పడింది. శనివారం (మే24) సాయంత్రం 6 గంటలనుంచి 7.15 గంటల వరకు దాదాపు గంటకు పై సేవలు నిలిచిపోయాయి. 

టెక్నికల్ సమస్యలతో ట్విట్టర్ సేవలకు అంతరాయం కలిగినట్లు తెలుస్తోంది. యాప్ ఓపెన్ చేస్తే  Something went wrong. Try reloading అంటూ మేసేజ్ డిస్ ప్లే అవుతోంది. ట్విట్టర్ కు భారత్ లో మూడుకోట్ల మంది యూజర్లున్నారు. 

శనివారం సాయంత్రం ఒక్కసారిగా  ట్విట్టర్ సేవలు నిలిచిపోవడంతో యూజర్లు గందరగోళంలో పడ్డారు. మేసేజ్, వీడియోలు, ఫొటోలను షేర్ చేయడంలో అంతరాయం ఏర్పడటంతో ఆందోళన చెందుతున్నారు.