నా ‘ఎక్స్’ అకౌంట్.. తొలగించినా ఆశ్చర్యం లేదు: అభిజిత్ దీప్కే

నా ‘ఎక్స్’ అకౌంట్.. తొలగించినా ఆశ్చర్యం లేదు:  అభిజిత్ దీప్కే

న్యూఢిల్లీ: బెంగాల్ మాజీ సీఎం మమతా బెనర్జీ తమ ఉద్యమానికి మద్దతు తెలిపినందుకు ఆమెకు కృతజ్ఞత చెబుతూ పెట్టిన పోస్ట్​పై ‘ఎక్స్’ ఆంక్షలు విధించిందని సీజేపీ ఫౌండర్​ అభిజీత్ దిప్కే తెలిపారు. అక్టోబర్ 10లోపు తన ఎక్స్ ఖాతాను పూర్తిగా తొలగించినా ఆశ్చర్యపోనక్కర్లేదని శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 

 ‘‘కాక్రోచ్ ఉద్యమానికి మద్దతు తెలిపినందుకు మమతా బెనర్జీకి ధన్యవాదాలు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి భారతీయులందరూ ఏకం కావాల్సిన సమయమిది’’ అని దిప్కే ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. ఈ పోస్ట్​నుటీఎంసీ రాజ్యసభ ఎంపీ డెరెక్ ఓబ్రియన్ రీట్వీట్ చేశారు. అయితే, ఆపై కొద్దిసేపటికే ఈ పోస్ట్​పై ఎక్స్ పరిమితులు విధించింది.