
బీజింగ్: చైనా(China) అధ్యక్షుడిగా జీ జిన్‌పింగ్(Xi Jinping) మూడవసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సెంట్రల్ మిలిటరీ కమిషన్(CMC) చైర్మెన్‌గా కూడా ఆయన ఎన్నికయ్యారు. బీజింగ్‌లో జరుగుతున్న 14వ నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ పార్టీ సమావేశాల్లో మార్చి 10న ఏకగ్రీవంగా(Unanimously) దేశాధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. చైనా ఉపాధ్యక్షుడిగా హాన్ జంగ్ ఎన్నికయ్యారు. మార్చి 10న జరిగిన సమావేశంలో 2,952 ఓట్లు ఏకగ్రీవంగా జిన్‌పింగ్‌కు పోలయ్యాయి.
మూడవ సారి దేశాధ్యక్షుడిగా ఎన్నికైన జీ జిన్‌పింగ్ .. బీజింగ్‌లోని గ్రేట్ హాల్ ఆఫ్ పీపుల్(Great Hall of People)లో రాజ్యాంగం మీద ప్రమాణం చేశారు. స్టాండింగ్ కమిటీ చైర్మెన్‌గా ఎన్నికైన జావో లెజితో పాటు ఉపాధ్యక్షుడు హాన్ జంగ్ కూడా రాజ్యాంగం(Constitution) మీద ప్రమాణం చేశారు.
69 ఏళ్ల జీ జిన్‌పింగ్ మరో అయిదేళ్ల పాటు దేశాధ్యక్షుడిగా కొనసాగనున్నారు. గత ఏడాది అక్టోబర్‌లో ఆయన చైనీస్ కమ్యూనిస్టు పార్టీ(China Communist Party) నేతగా నియమితులైన విషయం తెలిసిందే.