దూసుకొస్తున్న యాస్ తుఫాన్

దూసుకొస్తున్న యాస్ తుఫాన్

యాస్ తుఫాన్ క్రమంగా బంగాళాఖాతం తీరంవైపు దూసుకొస్తోంది. మరో 12 గంటల్లో అతితీవ్ర తుపానుగా మారనున్నట్లు వాతావరణశాఖ హెచ్చరించింది. తూర్పు, మధ్య బంగాళాఖాతం నుంచి  ఉత్తర, వాయవ్య దిశగా ప్రయాణిస్తోంది. గంటకు 9 కిలోమీటర్ల వేగంతో తుఫాను ప్రయాణిస్తోంది. బుధవారం సాయంత్రం ఉత్తర ఒడిశా మరియు బెంగాల్ తీవ్ర ప్రాంతాలను తుఫాను తాకుతుందని ఐఎండి అంచనా వేసింది. ఒడిశాలోని బాలసోర్ వద్ద తుఫాను తీరం దాటే అవకాశమున్నట్లు ఐఎండీ తెలిపింది. ప్రస్తుతం యాస్ తుఫాన్ పారాదీప్‌కు తూర్పు ఆగ్నేయ దిశగా 320 కి.మీ దూరంలో కేంద్రీకృతమైనట్లు వాతావరణ అధికారులు తెలిపారు.