కష్టకాలంలో ప్రజలపై భారం వేస్తరా..?

కష్టకాలంలో ప్రజలపై భారం వేస్తరా..?

యాదాద్రి, వెలుగు: కరోనా కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్న టైంలో ఎల్ ఆర్ ఎస్ పేరుతోభారం వేయడం ఏంటని యాదాద్రి డీసీసీ అధ్యక్షుడు కుంభం అనిల్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. గురువారం ఆయన భువనగిరిలో మీడియాతో మాట్లాడారు. పల్లెటూళ్లలో ఎల్ ఆర్ ఎస్ చేసుకోవాలని చెప్పడం సరికాదన్నారు. ధరలు లక్షల్లో ఉన్న హైదరాబా ద్ ను, వందల్లో ఉన్న పల్లెటూళ్లను ఒకే గాటన కట్టడం దేశంలో ఎక్కడా లేదన్నారు. 200 గజాల వరకు ఉచితంగా రెగ్యులరైజ్ చేయాలని, ఎల్ ఆర్ ఎస్ అమలును ఏడాది పాటు వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. కరోనా కట్టడికి అన్ని ఏరియా హాస్పి టల్స్ లో ఐసోలేషన్ సెంటర్లు ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో పోత్నక్ ప్రమోద్ కుమార్ , బర్రె జహంగీర్ , బీసుకుంట్ల సత్యనారాయణ పాల్గొన్నారు.