వర్షాల కోసం చుట్టుకాముడు, దేవస్థాలకు నీళ్లతో అభిషేకం

వర్షాల కోసం చుట్టుకాముడు, దేవస్థాలకు నీళ్లతో అభిషేకం

యాదాద్రి భువనగిరి : జూన్ పోయింది. జూలై వచ్చింది. అయినా వానదేవుడు కరుణించడంలేదు. ఇప్పటికే విత్తనాలు పెట్టిన రైతన్నలు వానల కోసం ఎదురుచూస్తున్నారు. గ్రామాల్లో హోమాలు, చుట్టుకాముడు, గుళ్లల్లో దేవస్థాల విగ్రహాలకు నీళ్లు పోస్తూ వర్షాలు పడాలని మొక్కులు మొక్కుతున్నారు. సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లా వీరవెల్లి గ్రామంలో వానల కోసం చుట్టుకాముడు ఆడారు. మహిళలు నీళ్ల బిందెలతో బొడ్రాయికి నీళ్లు పోశారు. పత్తి విత్తనాలు పెట్టిన వందల ఎకరాలు వార్షాలు లేక అన్నదాతలకు నష్టం వాటిల్లిందని చెబుతున్నారు.