
యాదాద్రి లక్ష్మీనరసింహుని ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవు కావటంతో.. భక్తులు భారీగా తరలివచ్చారు. కల్యాణ, వ్రత మండపాలు, లడ్డూ ప్రసాద కౌంటర్ల దగ్గర భక్తుల రద్దీ భారీగా ఉంది. స్వామివారి ధర్మ దర్శనానికి మూడు గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి గంట సమయం పడుతోంది. ఆలయ అభివృద్ధి పనులు జరుగుతున్నందున.. కొండపైకి వాహనాలను అనుమతించడంలేదు అధికారులు.