
యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో చింతపండు చోరీ ఘటనపై హైలెవెల్ కమిటీ వేశారు. మొత్తం ఐదుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేశామని తెలిపారు ఆలయ ఈవో వెంకట్రావు. ఈ కమిటీలో ఎండోమెంట్ అడిషనల్ కమిషనర్,రీజినల్ జాయింట్ కమిషనర్, నల్గొండ, రంగారెడ్డి, సికింద్రాబాద్ ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్లను సభ్యులుగా నియమించారు.
యాదాద్రి లక్ష్మీనారసింహుడి ఆలయంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు ఈవో వెంకట్రావు. సత్యనారాయణ స్వామి వ్రతంలో పాల్గొనే భక్తులకు స్వామి వారి శేషవస్త్రం గా శేల్లా,కనుమ అందజేస్తామన్నారు. ఆలయ కొండచుట్టు ఉన్న రింగ్ రోడ్డు లోని సర్కిల్ కి ఆధ్యాత్మికతో నామకరణం చేశామన్నారు. వైకుంఠ ద్వారం ఎదురుగా గల సర్కిల్ కి అభయ ఆంజనేయ సర్కిల్ గా తరవాత వచ్చే సర్కిల్ కు గరుడ సర్కిల్ గా కొండపైకి వెళ్లే మార్గం వద్ద గల సర్కిల్ కి రామానుజ సర్కిల్ గా మల్లాపురం వెళ్లే దారిలో గల సర్కిల్ కి యాదార్షి సర్కిల్ గా నామకరణం చేశామన్నారు.
ప్రతిరోజు స్వామి వారి దర్శనానికి వచ్చే భక్తుల కోసం మంచినీటి సదుపాయం, శని,ఆదివారాల్లో బటర్ మిల్క్ అందిస్తామన్నారు ఈవో. ఎస్పీఎస్,హోంగార్డు సిబ్బందిని పెంచుతూ ఆలయ భద్రతను కట్టుదిట్టం చేశామన్నారు ఈవో.
ఆలయ పరిసరాల్లో ఆధునిక సాప్ట్ వేర్ సీసీ కెమెరాలను అదనంగా ఏర్పాటు చేసి భద్రత పర్యవేక్షణ పెంచామన్నారు. లీజుల విభాగంలో పెండింగ్ గల టెండర్లు అన్నింటిని వెంటనే నిర్వహిస్తామన్నారు. భక్తుల రవాణాకు ఆలయ పరిధిలో తిరిగే బ్యాటరీ వాహనాల సంఖ్య పెంచుతామన్నారు. భక్తుల సౌకర్యార్థం ఆలయ పరిసర ప్రాంతాల్లో నేమ్ బోర్డ్స్,సైన్ బోర్డ్స్ ఏర్పాటు చేస్తామన్నారు.
కొండపైకి వచ్చే ఘాట్ రోడ్డుకు ఇరు వైపుల శ్లోకాలు,కీర్తనలు రాయడం, స్ట్రాటజీక్ స్థలంలో పెద్ద సైజ్ సలహాలు,సూచనల బాక్సులు ఏర్పాటు చెస్తామన్నారు. దేవస్థానం పరిసర ప్రాంతాల్లో పరిశుభ్రత ప్రమాణాలు పెంపొందించి అత్యంత శుభ్రంగా ఉండే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు ఆలయ ఈవో వెంకట్రావు.