యాదాద్రి ఆలయంలో మళ్లీ లీకేజ్

యాదాద్రి ఆలయంలో మళ్లీ లీకేజ్

యాదాద్రి, వెలుగు: యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ పునర్నిర్మాణంలో నాణ్యతా లోపాలు బయటపడుతూనే ఉన్నాయి. బుధవారం నుంచి కురుస్తున్న వర్షాలకు అష్టభుజి మండపంలో లీకేజీ ఏర్పడింది. రెండు నెలల కిందట కురిసిన  వర్షాలకు ఆలయ మండపాల్లోకి వర్షపు నీరు చేరింది. అప్పట్లో పంచతల రాజగోపురం ప్రాకార మండపాల్లోని అద్దాల మండపంలోకి నీరు చేరడంతో టెక్నీషియన్లు వచ్చి రిపేర్లు చేశారు. ఇటీవల ఆలయం చుట్టూ కృష్ణ శిలలతో వేసిన ఫ్లోరింగ్ కుంగిపోయింది. బ్రహ్మోత్సవ మండపం పక్కన కుంగిన ప్లోరింగ్ను తొలగించి కొత్తగా ఏర్పాటు చేస్తున్నారు. తాజాగా అష్టభుజి మండపంలో లీకేజీ ఏర్పడింది. దీన్ని ఫొటోలు తీయడానికి మీడియా ప్రయత్నించగా.. పోలీసులు అడ్డుకున్నారు. బుధవారం యాదాద్రికి వచ్చిన సీఎంవో సెక్రటరీ భూపాల్ రెడ్డి కుంగిపోయిన ప్లోరింగ్ను పరిశీలించి.. నాణ్యత లోపాలు ఉంటే సహించబోమని హెచ్చరించిన మరుసటి రోజే లీకేజీ ఏర్పడింది.