యాదాద్రి ఆలయం మూసివేత.. మళ్లీ ఎప్పుడు తెరుస్తారంటే....

యాదాద్రి ఆలయం మూసివేత.. మళ్లీ ఎప్పుడు తెరుస్తారంటే....

తెలంగాణలో పేరొందిన యాదాద్రి పుణ్యక్షేత్రంలోని ఆలయాలన్నింటినీ చంద్రగ్రహణం కారణంగా శనివారం (అక్టోబర్ 28) సాయంత్రం 4 గంటలకే మూసివేశారు. ఉదయం నుంచి మధ్యాహ్నం మూడింటి వరకు ప్రధానాలయంలో పంచనారసింహులు, అనుబంధ ఆలయాలతో పాటు ఉప ఆలయాల్లో యథావిధిగా నిత్యారాధనలు నిర్వహించిన పూజారులు సాయంత్రం జరగాల్సిన కైంకర్యాలను 3 నుంచి 4 గంటల వరకు చేపట్టి ద్వార బంధనం చేశారు.

శనివారం ( అక్టోబర్ 28)  సాయంత్రం 4 గంటల నుంచి అక్టోబర్  29వ తేదీ  ఆదివారం ఉదయం  5 గంటలకు ఆలయాన్ని తిరిగి తెరిచి సంప్రోక్షణ చేయనున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు నందింగల్ లక్ష్మీనరసింహచార్యులు వెల్లడించారు. ప్రధానాలయంతో పాటు అనుబంధ ఆలయాలైన శ్రీపర్వతవర్ధిని సమేత రామలింగేశ్వరస్వామి ఆలయం, పాతగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయాలను కూడా మూసివేశారు. అలాగే విజయవాడ దుర్గగుడి, శ్రీశైలం, తిరుమల శ్రీవారి  ఆలయాలు కూడా మూసివేశారు. 

ఆ్వయుజ పౌర్ణమి రోజున ఏర్పడుతోన్న ఈ గ్రహణం భారత కాలమానం ప్రకారం ఇవాళ ( అక్టోబర్ 28 )  అర్ధరాత్రి దాటిన తర్వాత 1.04 గంటలకు ప్రారంభమై.. రాత్రి 2.24 గంటలకు ముగియనుంది. దాదాపు గంటన్నర మాత్రమే గ్రహణం ఉంటుంది. ఈ పాక్షిక చంద్రగ్రహణం భారత్‌లోనూ కనువిందు చేయనుంది. భారత్‌తోపాటు నేపాల్, అల్జీరియా, జర్మనీ, పొలండ్, నైజీరీయా, బ్రిటన్, స్పెయిన్, స్వీడన్, శ్రీలంక, బంగ్లాదేశ్, భూటాన్, మంగోలియా, అఫ్గనిస్థాన్, చైనా, ఇరాన్, టర్కీ, మలేసియా, ఫిలిప్పీన్స్, థాయ్‌లాండ్, ఆస్ట్రేలియా, జపాన్, ఇండోనేషియా, కొరియాతో పాటు బ్రెజిల్‌లోని తూర్పు ప్రాంతంలో ఈ గ్రహణాన్ని చూడవచ్చు. దీన్ని అంశిక చంద్ర గ్రహణంగా పిలుస్తారని పండితులు చెప్పారు. 

ALSO READ : Diwali Special : లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే దీపావళి రోజున ఇలా చేయండి..