Diwali Special : లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే దీపావళి రోజున ఇలా చేయండి..

Diwali Special : లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే దీపావళి రోజున ఇలా చేయండి..

దీపావళికి పండుగ ఎలా  చేసుకోవాలా.. ఆరోజు ఏం చేయాలా .. ఆ రోజు ఎలా గడపాలో  దాదాపు   జనాలు  ప్లాన్ రడీ చేసుకున్నారు. అయితే ఏ రకంగా సంబరాలు చేసుకున్నా దీపాల కాంతులు మాత్రం కంపల్సరీ...   దీపాల కాంతులతో ప్రతి ఇల్లు మెరిసిపోవాలని దానికి సిద్దం చేసుకుంటున్నారు. ఇంకా ఇంట్లో తయారు చేసే మిఠాయిలు....  దీపాలు ఇంట్లో సిద్ధం చేసుకుని.. లక్ష్మీదేవిని ఇంటికి ఆహ్వానించడానికి అందరూ రెడీ అయిపోయారు. అయితే.. దీపావళికి మరింత ఎక్కువ అదృష్టం పొందడానికి కొన్ని వాస్తు టిప్స్ ఫాలో అవ్వాలని వాస్తు పండితులు అంటున్నారు. ఇంట్లో కొన్ని మార్పులు చేసుకోవడం వల్ల దీపావళి సకల సౌభాగ్యాలు, సంపదలు పొందుతారు. మరి దీపావళి లక్ష్మీని ఇంటికి ఆహ్వానించడానికి ఇంట్లో ఎలాంటి వాస్తు నియమాలు పాటించాలో చూద్దాం.. 

 శుభ్రం చేయడం 

దీపావళికి ఒక రోజు ముందు ఇంటిని శుభ్రం చేసుకోవాలి.  ప్రతి మూల ఉన్న బూజును.. చెత్త చెదారాన్ని తొలగించాలి.  ఎప్పటికీ ఉపయోగపడని చెత్త వస్తువులను బయట పడేయాలి.  ఆ తరువాత నీళ్లతో ఇంటిని శుభ్రం చేసుకోవాలి.  దేవుడి పటాలను శుభ్రం చేసుకోవాలి.   చక్కగా అలంకారం చేసుకొని.. ఈశాన్య భాగంలో అంటే ఇంట్లో దేవుడిని పెట్టుకొనే ప్రదేశంలో గో పంచకం,, గో మయంతో అలకాలి.

 వెలుగు 

దీపావళి పండుగ రోజు ఇంట్లోని ఏ మూల కూడా.. చీకటిగా ఉండకూడదు. ఖచ్చితంగా ఇంట్లోని ప్రతి కార్నర్ ని వెలుగులతో నింపాలి. అంటే ఇంటిలో దీపాలు పెట్టాలని అంటున్నారు పండితులు. 

 స్వస్తిక్

 పవిత్రమైన స్వస్తిక్ గుర్తుని.. ఇంటి ముఖద్వారంపై అతికించాలి. ఇలా చేయడం వల్ల అదృష్టం వరిస్తుంది. ఇలా చేస్తే కేవలం దీపావళి రోజే కాదు.. ఎప్పటికీ ఈ సింబల్ ఉండటం మంచిది.

 లక్ష్మీ విగ్రహం 

వాస్తు ప్రకారం లక్ష్మీ పూజను ఇంట్లో ఉత్తరంవైపు చేయాలి. ఇలా చేస్తే సంపద సిద్ధిస్తుంది. పూజ చేసేటప్పుడు.. లక్ష్మీ విగ్రహానికి ఎడమవైపు ఖచ్చితంగా వినాయకుడి విగ్రహం పెట్టాలి. 

ఉప్పు నీళ్లు 

కొద్దిగా ఉప్పును నీళ్లలో మిక్స్ చేసి.. ఇంటి చూట్టూ చిలకరించాలి. ముఖ్యంగా.. దీపావళి రోజు కంపల్సరీ ఉప్పు నీళ్లు చల్లాలి. ఉప్పు.. ఇంట్లో, గాలిలో ఉండే నెగటివిటీని గ్రహిస్తుంది. 

ముగ్గు 

ముగ్గు అనేది కేవలం ఆకర్షణకు మాత్రమే కాదు.. ముగ్గు వేయడం వల్ల సంపద, శ్రేయస్సు మీ ఇంటికి కలుగుతుంది. ముగ్గులో వేయడానికి గ్రీన్, బ్లూ, పింక్ కలర్స్ ఉపయోగించాలి. ఇంటికి ప్రధాన గేట్ ముందు.. మీరే ఖచ్చితంగా ముగ్గు వేయాలి. దీనివల్ల శ్రేయస్సు పొందుతారు.

 ధూపం....దీపం  

ధూపం ఇంట్లో మంచి సువాసనను మాత్రమే కాదు.. ఇంటికి పాజిటివ్ ఎనర్జీని తీసుకొస్తుంది. చందనం అగరబత్తీలనే దీపావళి రోజు ఉపయోగించాలి. ఇది.. ఇంటికి పాజిటివ్ ఎనర్జీని తీసుకొస్తుంది. 

మెయిన్ డోర్ 

దీపావళి రోజు ఖచ్చితంగా మెయిన్ డోర్ ఓపెన్ లోనే పెట్టుకోవాలి. ఇది.. మీరు ఇంటికి లక్ష్మీదేవిని ఆహ్వానిస్తున్నారని సూచిస్తుంది. నిద్రపోతున్నా కూడా.. కనీసం ఒక కిటికీ తలుపునైనా తీసి ఉంచడం వల్ల.. లక్ష్మీదేవిని ఆహ్వానించినట్టు అవుతుంది. 

మంత్రం

 దీపావళి రోజు ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని చదవడం వల్ల.. ఇంట్లో ఉండే ఎలాంటి దోషమైనా తొలగిపోతుంది. కాబట్టి దీపావళి రోజు ఈ మంత్రాన్ని జపించడం ఎట్టిపరిస్థితుల్లో మరిచిపోవద్దని వాస్తు పండితులు సూచిస్తున్నారు.