చాహల్ సరికొత్త చరిత్ర..187 వికెట్లతో అగ్రస్థానం

చాహల్ సరికొత్త చరిత్ర..187 వికెట్లతో అగ్రస్థానం

రాజస్థాన్ రాయల్స్ స్పిన్నర్ యుజువేంద్ర చాహల్ ఐపీఎల్‌లో నయా రికార్డు సృష్టించాడు. ఐపీఎల్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా నిలిచాడు.  కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచులో చాహల్ నితీశ్ రాణా వికెట్ తీయడం ద్వారా ఈ ఘనత సాధించాడు. చాహల్ ఇప్పటి వరకు ఐపీఎల్ లో 187 వికెట్లు తీయడం విశేషం.  అంతకుముందు ఈ రికార్డు చెన్నై మాజీ బౌలర్ డ్వేన్ బ్రావో (183) పేరిట ఉండేది.

చాహల్ అగ్రస్థానం..

ఐపీఎల్ చరిత్రలో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్ల జాబితాలో 187 వికెట్లతో  చాహల్ అగ్రస్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత 183 వికెట్లతో  బ్రావో రెండు స్థానంలో ఉన్నాడు. 174 వికెట్లతో పియూష్‌ చావ్లా మూడో ప్లేస్, 172 వికెట్లతో  అమిత్‌ మిశ్రా నాల్గో ప్లేస్, 171 వికెట్లతో అశ్విన్ ఐదో ప్లేస్ లో ఉన్నారు. 

చాహల్  ప్రస్తుతం రాజస్థాన్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.చాహల్ గతంలో ముంబై, బెంగళూరు జట్లకు ప్రాతినిథ్యం వహించాడు. మొత్తంగా  ఇప్పటి వరకు  చాహల్ 143 మ్యాచుల్లోనే 187 వికెట్లను పడగొట్టాడు.