యమహా తన కొత్త మోటార్‌సైకిల్ ఎక్స్ఎస్ఆర్155ను భారత మార్కెట్లో విడుదల చేసింది. దీని ధర రూ. 1.50 లక్షలుగా నిర్ణయించింది. ఇందులోని 155 సీసీ ఇంజిన్ 18.4 పీఎస్ పవర్, 14.1 ఎన్ఎం టార్క్ ఉత్పత్తి చేస్తుంది.
వేరియబుల్ వాల్వ్ యాక్చుయేషన్ (వీవీఏ) టెక్నాలజీ వల్ల తక్కువ, ఎక్కువ ఆర్పీఎంల వద్ద మెరుగ్గా పనిచేస్తుంది. అసిస్ట్ అండ్ స్లిప్పర్ క్లచ్ డెల్టాబాక్స్ ఫ్రేమ్, అప్‌సైడ్ డౌన్ ఫ్రంట్ ఫోర్క్స్, ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రమెంట్ క్లస్టర్ దీని ప్రత్యేకతలు.
