2.65 లక్షల ఎకరాల్లో శనగ: సర్కారుకు అగ్రికల్చర్ శాఖ రిపోర్టు​

2.65 లక్షల ఎకరాల్లో శనగ: సర్కారుకు అగ్రికల్చర్ శాఖ రిపోర్టు​

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఈ యాసంగిలో ఇప్పటి వరకు 5.75 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. ఈ మేరకు బుధవారం వ్యవసాయశాఖ సర్కారుకు నివేదిక అందించింది. ఇందులో అత్యధికంగా శనగలు 2.65 లక్షల ఎకరాల్లో, వేరు శనగ 1.31 లక్షల ఎకరాల్లో సాగైనట్లు తెలిపింది. ఇప్పటివరకు రైతులు ఈ రెండు పంటలనే అధికంగా సాగు చేసినట్టు వివరించింది. వరి నాట్లు కేవలం 5,028 ఎకరాల్లోనే పడ్డాయని, ఇంకా చాలాచోట్ల వానాకాలం సీజన్‌‌‌‌‌‌‌‌కు సంబంధించిన కోతలు సాగవుతుండడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందని చెప్పింది.

తొందరలోనే వరి సాగు పెరుగుతుందని తెలిపింది. ఈ ఏడాది ఈ సీజన్‌‌‌‌‌‌‌‌లో ఇప్పటివరకు నిరుడు కంటే తక్కువే పంటలు సాగయ్యాయని నివేదికలో పేర్కొంది. గతేడాది ఇదే టైంకు 7.77 లక్షల ఎకరాల్లో పంటలు సాగైనట్టు తెలిపింది. ఈ యాసంగి సీజన్‌‌‌‌‌‌‌‌లో సాధారణ సాగు 47.85 లక్షల ఎకరాలుగా అగ్రికల్చర్​ అధికారులు అంచనా వేశారు.