V6 News

Toxic: రియలిస్టిక్గా రొమాన్స్.. లేడీ డైరెక్టర్ మ్యాజిక్కి ఫిదా.. రోమాంటిక్ సీన్స్పై యశ్ కామెంట్స్ వైరల్!

Toxic: రియలిస్టిక్గా రొమాన్స్.. లేడీ డైరెక్టర్ మ్యాజిక్కి ఫిదా.. రోమాంటిక్ సీన్స్పై యశ్ కామెంట్స్ వైరల్!

రాకింగ్ స్టార్ యశ్ హీరోగా, దర్శకురాలు గీతూ మోహన్‌దాస్ తెరకెక్కిస్తున్న ‘టాక్సిక్’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. 1950-70ల గోవా బ్యాక్‌డ్రాప్‌లో డ్రగ్ మాఫియా కథగా రూపొందుతున్న ఈ చిత్రంలో నయనతార, కియారా అద్వానీ హీరోయిన్స్గా నటిస్తున్నారు. ఇపుడు ఈ మోస్ట్ అవైటెడ్ మూవీ 2026 జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ క్రమంలోనే యశ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసి ఆడియన్స్లో హీట్ పెంచేశారు. వివరాల్లోకి వెళితే..

టీజర్పై చర్చలు..

‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్’ టీజర్ విడుదలైనప్పటి సోషల్ మీడియాలో సెన్షేషనల్ గా మారింది. ప్రశంసలు, విమర్శలతో టాక్సిక్ సినిమా వార్తల్లో నిలుస్తూ వస్తుంది. ముఖ్యంగా టీజర్ లో కొన్ని శృంగారభరితమైన సన్నివేశాలు ఉండటంతో విమర్శలు వెల్లువెత్తాయి. అయితే, ఈ విమర్శల మధ్య యశ్ తన అభిప్రాయాన్ని స్పష్టంగా వెల్లడిస్తూ దర్శకురాలు గీతూ మోహన్‌దాస్ కు మద్దతుగా నిలిచారు.

రొమాన్స్‌పై యశ్ క్లారిటీ..

‘‘గ్యాంగ్‌స్టర్ సినిమాలు మగ దర్శకులే బాగా చేస్తారనే అభిప్రాయం ఉంది. కానీ గీతూ మోహన్‌దాస్ దాన్ని మార్చేశారు. శృంగారం నుంచి యాక్షన్ వరకు ప్రతి అంశాన్ని క్లియర్‌గా, పవర్‌ఫుల్‌గా చూపించారు. ఒక మహిళా దర్శకురాలు ఎమోషన్స్‌ను ఎంత బలంగా ప్రజెంట్ చేయగలదో ఆమెతో పని చేసిన తర్వాతే తెలిసింది. ఆమె నుంచి నేను చాలా నేర్చుకున్నాను’’ అని యశ్ తెలిపారు.

అలాగే, ఈ సినిమాలో యాక్షన్, ఎమోషన్స్ ప్రేక్షకులు ఎప్పుడూ చూడని విధంగా ఉంటాయని యష్ చెప్పుకొచ్చారు. అంతేకాకుండా గ్యాంగ్‌స్టర్ కథలను మహిళా దర్శకులు కూడా అద్భుతంగా తెరకెక్కించగలరని గీతూ మోహన్‌దాస్ నిరూపిస్తారని అన్నారు. ముఖ్యంగా ఈ చిత్రంలోని శృంగార సన్నివేశాల నుంచి యాక్షన్‌ సీన్స్ వరకు ప్రతి దానిలోనూ ఆమె ఆలోచనలు చాలా స్పష్టంగా ఉన్నాయి. సున్నితమైన భావాలను ఎంత మనసుకు హత్తుకునేలా చూపించారో.. యాక్షన్ సన్నివేశాలను కూడా అదే స్థాయిలో రియలిస్టిక్‌గా, విభిన్నంగా తెరకెక్కించారని యశ్ చెప్పుకొచ్చారు. 

రొమాన్స్‌పై CBFC క్లారిటీ..

టాక్సిక్ మూవీ టీజర్ యూట్యూబ్‎లో విడుదల చేశారని.. యూట్యూ్బ్ తమ పరిధిలోకి రాదని CBFC ‎క్లారిటీ ఇచ్చింది. కేవలం థియేటర్‎లలో విడుదల అయ్యే సినిమాలు, ట్రైలర్‌లకు మాత్రమే సెన్సార్ సర్టిఫికేట్ అవసరమని పేర్కొన్నాయి. యూట్యూబ్‎లో విడుదల చేసిన టీజర్‌కు  CBFC సర్టిఫికేట్ అవసరం లేదని వివరణ ఇవ్వడంతో విషయం సద్దుమణిగింది. 

టాక్సిక్' విషయానికొస్తే.. ఇది ఒక స్టైలిష్ గ్యాంగ్ స్టర్ డ్రామాగా తెరకెక్కుతోంది. కె.వి.ఎన్ ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్తో నిర్మిస్తుంది. నదియా పాత్రలో కీలక పాత్రలో కనిపించనుండగా హ్యుమా ఖురేషీ ఎలిజిబెత్, నయనతార గంగ పాత్రలో, రెబెకాగా తారా సుతారియా అలరించనున్నారు. మెలిసా అనే పాత్రలో రుక్మిణి వసంత్ ఆకట్టుకోనున్నారు.