యష్ ‘టాక్సిక్’ సినిమాలో ఎలిజిబెత్‌‌‌‌గా హుమా ఖురేషి

యష్ ‘టాక్సిక్’ సినిమాలో ఎలిజిబెత్‌‌‌‌గా హుమా ఖురేషి

బాలీవుడ్‌‌‌‌లో క్రేజీ హీరోయిన్‌‌‌‌గా గుర్తింపు తెచ్చుకున్న హుమా ఖురేషి  ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్టులతో బిజీగా ఉంది. ఆమె నటిస్తున్న చిత్రాల్లో ఒకటి ‘టాక్సిక్ : ఎ ఫెయిరీటేల్ ఫ‌‌‌‌ర్ గ్రోన్ అప్స్’.  కన్నడ స్టార్ యశ్‌‌‌‌ హీరోగా రూపొందుతోన్న ఈ  ప్రెస్ట్రీజియస్ ప్రాజెక్టులో హుమా కీలక పాత్రలో కనిపించనుంది. 

ఆదివారం ఈ చిత్రం నుంచి ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్‌‌‌‌‌‌‌‌తో పాటు క్యారెక్టర్‌‌‌‌‌‌‌‌ను రివీల్ చేశారు మేకర్స్. ఇందులో  ఆమె ఎలిజిబెత్‌‌‌‌గా  కనిపించనుందని తెలియజేశారు. క్యారెక్టర్‌‌‌‌‌‌‌‌కు  తగ్గట్టుగానే తన ఫస్ట్ లుక్ చాలా రిచ్‌‌‌‌గా ఉంది.  గ్లామరస్ డ్రెస్ వేసుకుని రెట్రో లగ్జరీ కారు ముందు నిలబడి ఉన్న హుమా ఖురేషి లుక్ ఇంప్రెస్ చేస్తోంది.

పాతకాలపు రాణి గెటప్‌‌‌‌లో ఉన్న ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది.  గీతు మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో యశ్​, కియారా అద్వానీ, హుమా ఖురేషితో పాటు నయనతార, తారా సుతారియా, రుక్మిణి వసంత్, అక్షయ్ ఒబెరాయ్, సుదేవ్ నాయర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.  కేవీఎన్‌‌‌‌ ప్రొడక్షన్స్‌‌‌‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి యశ్‌‌‌‌ కూడా నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.  మార్చి 19న వరల్డ్‌‌‌‌వైడ్‌‌‌‌గా విడుదల చేయనున్నట్టు ఇప్పటికే ప్రకటించారు.