ముంబైకే ఆడతా..మనసు మార్చుకున్న జైశ్వాల్

ముంబైకే ఆడతా..మనసు మార్చుకున్న జైశ్వాల్

ముంబై: టీమిండియా ఓపెనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ యశస్వి జైస్వాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.. డొమెస్టిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్రికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ముంబైకే ఆడేందుకు ప్రాధాన్యత ఇస్తున్నాడు. నెల రోజుల కిందట గోవాకు ప్రాతినిధ్యం వహించేందుకు నో అబ్జెక్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సర్టిఫికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇవ్వాలని ముంబై క్రికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అసోసియేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (ఎంసీఏ)ను కోరిన అతను ఇప్పుడు మనసు మార్చుకున్నాడు. తాను ముంబైకి ఆడేందుకు అనుమతి ఇవ్వాలని తాజాగా ఎంసీఏని కోరాడు. 

‘ఫ్యామిలీ ప్లాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వల్ల నేను గోవాకు మారాలని అనుకున్నా. కానీ ఇప్పుడు మా ప్రణాళికలు మారిపోయాయి. ప్రస్తుతం నేను ముంబైలోనే ఉంటున్నా. అందుకే వచ్చే దేశవాళీ సీజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ముంబైకి ప్రాతినిధ్యం వహించేందుకు నేను అందుబాటులో ఉంటా. గతంలో నాకు ఇచ్చిన ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వోసీని ఉపసంహరించుకోవడానికి అవకాశం ఇవ్వాలని కోరుతున్నా. ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వోసీని నేను ఇంకా గోవా క్రికెట్ అసోసియేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సమర్పించలేదు’ అని జైస్వాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పేర్కొన్నాడు