జింఖానా బాధితురాలికి వైద్యం నిరాకరణ

జింఖానా బాధితురాలికి వైద్యం నిరాకరణ

హైదరాబాద్:  జింఖానా గ్రౌండ్ లో జరిగిన తొక్కిసలాటలో గాయపడిన వారికి ఉచితంగా ట్రీట్ మెంట్ అందిస్తామని హెచ్సీఏ ప్రకటించింది. ప్రతిపైసా తామే భరిస్తామని ప్రకటించినా క్షేత్రస్థాయిలో పరిస్థితి మరో విధంగా ఉంది. తొక్కిసలాటలో గాయపడి ప్రైవేటు హాస్పిటళ్లలో చికిత్స పొందుతున్న బాధితుల ముందుగా డబ్బు చెల్లిస్తేనే వైద్యం అందిస్తామని ఆస్పత్రి యాజమాన్యాలు అంటున్నాయి. 

ఉదయం జింఖానా గ్రౌండ్ లో గాయపడిన ఆలియా అనే యువతిని ట్రీట్ మెంట్ కోసం యశోద హాస్పిటల్ కు తరలించారు. అయితే రూ. 40వేలు చెల్లిస్తేనే చికిత్స మొదలుపెడతామని లేనిపక్షంలో యువతిని తీసుకెళ్లాలని హాస్పిటల్ యాజమాన్యం తెగేసి చెప్పింది. దీంతో ఉదయం బాధితురాలి తల్లి బేగం అతి కష్టమ్మీద రూ.17వేలు చెల్లించింది. అయితే మిగతా మొత్తం కట్టేందుకు డబ్బు లేకపోవడంతో తల్లడిల్లిపోతోంది. తన కుమార్తె పరిస్థితి బాగోలేదని, చేతిలో చిల్లిగవ్వ లేని పరిస్థితుల్లో తనను ఎక్కడకు తీసుకెళ్లాలని ఆవేదన వ్యక్తం చేస్తోంది.