క్యూరియాసిటీని పెంచుతోన్న 'యశోద' టీజర్

క్యూరియాసిటీని పెంచుతోన్న 'యశోద' టీజర్

స్టార్ హీరోయిన్లలో ఒకరిగా పేరు తెచ్చుకొని, రోజురోజుకీ మరింత పాపులారిటీని సొంతం చేసుకుంటున్న హీరోయిన్ సమంత లేడీ ఓరియెంటెడ్ లేటెస్ట్ చిత్రం యశోద. తాజాగా ఈ మూవీకి సంబంధించి టీజర్ ను మూవీ మేకర్స్ రిలీజ్ చేశారు. ఇప్పటికే విడుదలైన యశోద పోస్టర్స్, గ్లింప్స్ ఈ మూవీపై ఆసక్తిని పెంచుతుండగా... ఈ రోజు వచ్చిన టీజర్ మరింత క్యూరియాసిటీని పెంచుతోంది.  ఈ టీజర్ లో సమంత గర్భవతి పాత్రలో కనిపించనుంది. డాక్టర్ సమంతను గర్భవతి అయిన సమయంలో ఏ ఏ పనులైతే చేయొద్దని చెప్తుందో సమంత ఆ పనులే చేస్తూండడం ఉత్కంఠను రేకెత్తిస్తోంది. ఇక ఆమెను ఎవరో చంపడానికి ప్రయత్నించడం. వాళ్ళ నుంచి సామ్ తప్పించుకోవడం ఈ సినిమాపై మరింత ఇంట్రస్టింగ్ ను క్రియేట్ చేస్తున్నాయి. ఇంతకీ సమంతకు ఏమైంది... ఆమెను ఎందుకు చంపాలని ప్రయత్నిస్తున్నారు అనే విషయాలు తెలియాలంటే మరి కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందేనని మూవీ మేకర్స్ చెప్తున్నారు.  శ్రీదేవీ మూవీస్ బ్యానర్ లో శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి హరి శంకర్–హరీష్‌ నారాయన్ దర్శకత్వం వహిస్తున్నారు.