
అక్రమ కేసుల నుంచి తప్పించుకునేందుకే టీడీపీ రాజ్యసభ సభ్యులు టీడీపీ నుంచి బీజేపీలోకి వెళుతున్నారని వైసీపీ నేత విజయసాయి రెడ్డి అన్నారు. వాళ్ల అవినీతి ఎక్కడ బయటపడుతుందోనని చంద్రబాబు సూచన మేరకు జాతీయ అధికార పార్టీలో చేరుతున్నారని ఆయన ట్వీట్ చేశారు.
లక్షల కోట్ల అవినీతి బయటపడితే జీవితాంతం జైల్లోనే మగ్గాల్సి వస్తుందన్నఆందోళనతోనే చంద్రబాబు బిజెపితో మళ్ళీ సయోధ్యకు తహతహలాడుతున్నారని విజయసాయి అన్నారు. ముందుగా రాజ్యసభ సభ్యలను పంపించి రూట్ క్లియర్ ఆ తర్వాత.. వీళ్ల ద్వారా బిజెపి పెద్దలతో రాజీ కుదుర్చుకుని కేసుల నుంచి బయటపడేందుకు చంద్రబాబు ప్లాన్ వేశారని విజయసాయి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
మరో వైసీపీ నేత, మంత్రి శంకర్ నారాయణ కూడా టీడీపీని వీడిన ఈ నేతలపై ఇదే వ్యాఖ్యలు చేశారు. సుజనా, సీఎం రమేష్ లు చంద్రబాబు బినామీలని, బాబు అంగీకారంతోనే వారంతా పార్టీ మారారని ఆయన అన్నారు. త్వరలోనే ఆ పార్టీ ఎమ్మెల్యేలు కూడా టీడీపీని వీడతారని ఆయన అన్నారు.