వైసీపీ ఎమ్మెల్యేకు గుండెపోటు..ఆసుపత్రిలో అడ్మిట్

వైసీపీ ఎమ్మెల్యేకు గుండెపోటు..ఆసుపత్రిలో అడ్మిట్

ఏపీ మాజీమంత్రి,పెనమలూరు వైసీపీ ఎమ్మెల్యే పార్థసారథి తీవ్రఅస్వస్థతకు గురయ్యారు.పార్థసారథి అస్వస్థతతోపడిపోవడంతో వెంటనే కుటుంబసభ్యులు ఆయనను ఆస్పత్రికి తరలించారు. ఎమ్మెల్యేను పరీక్షించిన వైద్యులు ఆయనకు గుండెపోటు వచ్చిందని నిర్ధారించారు.

ప్రస్తుత రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా గుండెపోటు వస్తుంది. ఇలా గుండెపోటు వచ్చిన ఘటనలు అనేకం చూశాం. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు కూడా గుండెపోటు వచ్చిన ఘటనలు ఉన్నాయి. ఇక తాజాగా మాజీ మంత్రి, పెనుమలూరు వైసీపీ ఎమ్మెల్యే పార్ధసారథి గుండెపోటుకు గురయ్యారు.  దీనితో ఆయనను కుటుంబసభ్యులు హుటాహుటిన అశోక్ నగర్ లోని టాప్ స్టార్ ఆస్పత్రికి తరలించారు. ఎమ్మెల్యేకు పరీక్షలు చేసిన వైద్యులు యాంజియోగ్రామ్ చేసి స్టంట్ వేశారు. ప్రస్తుతం పార్థసారథి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. పార్థసారథిలో గుండెపోటు రావడంతో వైసీపీ నేతలు, కార్యకర్తలు ఒక్కొక్కరుగా ఆసుపత్రికి చేరుకుంటున్నారు.

అప్పటి వరకు ఆడుతూ పాడుతూ కళ్లముందే తిరిగే వారు చూస్తుండగానే క్షణాల్లో ప్రాణాలు కోల్పోయిన ఘటలను చాలా చూస్తుంటాం. దానికి కారణం.. కార్డియాక్‌ అరెస్ట్‌. ఈ కార్డియాక్‌ అరెస్ట్‌ ద్వారా వ్యక్తులు క్షణాల్లోనే ప్రాణాలు కోల్పోతున్నారు.