వైసీపీకి షాక్ - బీజేపీలో చేరిన ఎమ్మెల్యే

వైసీపీకి షాక్ - బీజేపీలో చేరిన ఎమ్మెల్యే

ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఇప్పటికే అధికార ప్రతిపక్షాలు అభ్యర్థుల జాబితాను ప్రకటించటంతో పార్టీ ఫిరాయింపులు ఉపందుకున్నాయి. ఆశించిన టికెట్ దక్కని చాలా మంది నేతలు తమ పార్టీకి రాజీనామా చేసి పక్క పార్టీలో చేరుతున్నారు. ఈ క్రమంలో గూడూరు వైసీపీ ఎమ్మెల్యే వరప్రసాద్ రావు పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. వచ్చే ఎన్నికల్లో తనకు టికెట్ కేటాయించకపోవటంతో ఆయన ఈ నిర్ణయానికి వచ్చారు.

కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ సమక్షంలో బీజేపీలో చేరారు వరప్రసాద్ రావు. ఈయనకు బీజేపీ నుండి తిరుపతి ఎంపీ టికెట్ కేటాయించే అవకాశం ఉందని సమాచారం అందుతోంది. ప్రజారాజ్యం పార్టీతో రాజకీయాల్లోకి వచ్చిన వరప్రసాద్, గత ఎన్నికల్లో వైసీపీ తరఫున గూడూరు నుండి పోటీ చేసి గెలుపొందారు. బీజేపీలో చేరిన తర్వాత మీడియాతో మాట్లాడిన ఆయన పార్టీలో చేర్చుకున్నందుకు ప్రధాని మోడీకి, పార్టీ పెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు.