సంగీత దర్శకుడిగా ఎన్నో సూపర్ హిట్ చిత్రాలకు మ్యూజిక్ అందించిన దేవిశ్రీ ప్రసాద్ ‘ఎల్లమ్మ’ చిత్రంతో హీరోగా ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ‘బలగం’ ఫేమ్ వేణు యెల్దండి దర్శకత్వంలో దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. అనౌన్స్‌మెంట్ నుంచే ఈ చిత్రంపై క్యూరియాసిటీ క్రియేట్ అయ్యింది. జూన్ ఫస్ట్ వీక్ నుంచి ఈ మూవీ షూటింగ్ మొదలు కానుంది. మొదటి షెడ్యూల్‌లో ప్రకాష్ రాజ్ సహా కీలక పాత్రధారులతో చిత్రీకరణ జరపనున్నారు.
జులైలో దేవిశ్రీ ప్రసాద్ షూట్‌లో జాయిన్ అవుతాడు. ఈలోపు మ్యూజిక్ పనుల్లో బిజీగా ఉన్నాడు దేవీ.ఈ సినిమా కోసం ఒక థీమ్ మ్యూజిక్ కంపోజ్ చేశాడట. సంగీత దర్శకుడిగా తనదైన ముద్ర వేసిన దేవిశ్రీ, ఈ చిత్రంలో నటుడిగా కూడా అదే స్థాయిలో ఆకట్టుకుంటాడా అన్న ఆసక్తి అభిమానుల్లో కనిపిస్తోంది. గ్రామీణ నేపథ్యంలో భావోద్వేగాలతో కూడిన కథను తెరకెక్కించడంలో ప్రత్యేక గుర్తింపు పొందిన వేణు యెల్దండి దర్శకత్వం వహిస్తుండటం, దేవిశ్రీ ప్రసాద్ హీరోగా పరిచయం అవడం, దిల్ రాజు నిర్మిస్తుండటంతో ఈ ప్రాజెక్టుపై అంచనాలు ఏర్పడ్డాయి.
