
గ్రేటర్ పరిధిలోని పలు ప్రాంతాల్లో మంగళవారం వర్షం దంచికొట్టింది. ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వాన పడింది. అత్యధికంగా చార్మినార్‌లో 4.85 సెంటీ మీటర్ల వర్షం కురిసింది. ముషీరాబాద్‌లో 4.70, ఉప్పల్‌లో 4.68, అంబర్‌పేటలో 4.60, కాప్రాలో 4.35, హయత్‌నగర్‌లో 4.18 సెంటీమీటర్లు, మిగిలిన ప్రాంతాల్లో మోస్తరు వాన పడింది. బుధ, గురువారాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
సిటీలో రెండ్రోజులపాటు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. వానల నేపథ్యంలో జోనల్ కమిషనర్లు, ఎస్ఈలతో జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి మంగళవారం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. అధికారులు, ఎమర్జెన్సీ టీమ్స్అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. వాటర్ లాగింగ్ పాయింట్లను, నాలాల సమీప ప్రాంతాలను ఎప్పటికప్పుడు పరిశీలించాలన్నారు.
– వెలుగు, హైదరాబాద్