నిజామాబాద్ నుంచి బంగ్లాదేశ్ కు రైల్లో పసుపు రవాణా

నిజామాబాద్ నుంచి బంగ్లాదేశ్ కు రైల్లో పసుపు రవాణా

రైల్వే అధికారుల చొరవ
ఫస్ట్ టైమ్ ట్రైన్ ట్రాన్స్ పోర్ట్
హైదరాబాద్‌‌, వెలుగు: నిజామాబాద్‌‌నుంచి పసుపును రైల్లోబంగ్లాదేశ్ కు తరలించారు. సోమవారం ఈ ట్రైన్ నిజామాబాద్ నుంచి బంగ్లాదేశ్ లోని బీన్ పోల్ కు బయలుదేరిందని రైల్వేఅధికారులు తెలిపారు. ఇన్నాళ్లు రోడ్డుమార్గం ద్వారానే పసుపును ఎక్స్ ఫోర్ట్ చేసేవారు. ఇది చాలా ఖర్చుతో కూడుకున్నది కావటంతో రైతులకు మేలు చేసేందుకు రైల్వే అధికారులు స్పెషల్ ట్రైయిన్ ఏర్పాటు చేశారు. హైదరాబాద్ డివిజన్ రైల్వే అధికారులు రైల్వే అమలు చేస్తున్న రాయితీలను రైతులు, వ్యాపారులకు వివరించే రైల్లో ట్రాన్స్ పోర్ట్ చేసేందుకు ఒప్పించారు. దీంతో 42 బీసీఎన్‌‌(బోగీ కంప్రెస్డ్ ‌‌న్యుమాటిక్)లలో 2, 474 టన్నుల సరుకు బంగ్లాదేశ్‌‌కు ఎక్స్ ఫోర్ట్ చేశారు. రైల్వే అధికారుల చొరవను దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్ ‌‌మాల్యా అభిందించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం