యెమెన్​లో తొక్కిసలాట..రంజాన్ ఆర్థిక సాయం పంపిణీలో విషాదం

యెమెన్​లో తొక్కిసలాట..రంజాన్ ఆర్థిక సాయం పంపిణీలో విషాదం
  • యెమెన్​లో తొక్కిసలాట..85 మంది మృతి
  • రంజాన్ ఆర్థిక సాయం పంపిణీలో విషాదం
  • 322 మందికి పైగా గాయాలు 
  • జనాన్ని కంట్రోల్ చేసేందుకు గాల్లోకి కాల్పులు 
  • పేలుడు సంభవించి పరుగులు పెట్టిన జనం

యెమెన్ లో రంజాన్ పండుగ సందర్భంగా పేదలకు ఆర్థిక సాయం పంపిణీ చేస్తుండగా తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 85 మంది చనిపోగా, 322 మందికి పైగా గాయపడ్డారు. యెమెన్ రాజధాని సనాలో బుధవారం రాత్రి లోకల్ బిజినెస్​మన్ ఒకరు పేద ముస్లింలకు ఆర్థిక సాయం పంపిణీ కార్యక్రమం చేపట్టారు. అక్కడికి పెద్ద ఎత్తున తరలివచ్చిన జనాన్ని  కంట్రోల్​ చేయడానికి హౌతీ రెబెల్స్ గాల్లోకి కాల్పులు జరిపారు. బుల్లెట్ ఎలక్ట్రికల్ వైర్ కు తగిలి పేలుడు సంభవించింది. దీంతో జనం పరుగులు పెట్టడంతో తీవ్ర తొక్కిసలాట జరిగింది. 

సనా:  యెమెన్​లో ఘోరం జరిగింది. రంజాన్ పండుగ సందర్భంగా పేదలకు ఆర్థిక సాయం పంపిణీ చేస్తుండగా తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ విషాద ఘటనలో 85 మంది చనిపోగా, 322 మందికి పైగా గాయపడ్డారు. యెమెన్ రాజధాని సనాలో బుధవారం రాత్రి లోకల్ బిజినెస్ మెన్ ఆధ్వర్యంలో పేద ముస్లింలకు 2,500 యెమెన్ రియాల్స్ (రూ.820) చొప్పున ఆర్థిక సాయం పంపిణీ చేశారు. ఓల్డ్ సిటీలోని ఓ స్కూల్ లో కార్యక్రమం ఏర్పాటు చేయగా, జనం పెద్ద ఎత్తున తరలివచ్చారు. స్కూల్ ప్రాంగణంలో జనం తాకిడి పెరగడంతో వాళ్లను కంట్రోల్ చేసేందుకు హౌతీ రెబెల్స్ గాల్లోకి కాల్పులు జరిపారు. అయితే బుల్లెట్ ఎలక్ట్రికల్ వైర్ కు తగిలి పేలుడు సంభవించింది. పెద్ద ఎత్తున శబ్దం రావడంతో జనం భయాందోళనకు గురయ్యారు. ఒక్కసారిగా జనం అందరూ ప్రాణభయంతో పరుగులు పెట్టారు. దీంతో తీవ్ర తొక్కిసలాట జరిగి అనేక మంది బలైపోయారు.  

శ్మశానంలా మారిన స్కూల్.. 

తొక్కిసలాట తర్వాత స్కూల్ ప్రాంగణమంతా శ్మశానంలా మారింది. ఎక్కడికక్కడ శవాల గుట్టలు కనిపించాయి. ఒకరిపై ఒకరు పడిపోవడంతో చాలామంది ఊపిరాడక చనిపోయారు. వాళ్ల చెప్పులు, ఇతర వస్తువులు గుట్టలుగా పడి ఉన్నాయి. ఈ ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరిని అరెస్టు చేశామని, విచారణకు ఆదేశించామని హౌతీ ప్రభుత్వ అధికారులు గురువారం తెలిపారు. నిర్వాహకులు లోకల్ అధికారులను సంప్రదించకుండానే ఈవెంట్ ఏర్పాటు చేశారన్నారు. మృతుల కుటుంబాలకు 5 లక్షల యెమెన్ రియాల్స్ (రూ.1.65 లక్షలు) గాయపడినోళ్లకు లక్ష రియాల్స్ (రూ. 33 వేలు) చొప్పున పరిహారం ఇస్తామన్నారు. కాగా, యెమెన్ 2014 నుంచి హౌతీ తిరుగుబాటుదారుల అధీనంలో ఉంది.