ఫిడే చెస్‌‌‌‌ వరల్డ్‌‌‌‌ కప్‌‌‌‌ ఫైనల్‌‌‌‌ తొలి గేమ్‌‌‌‌ డ్రా

ఫిడే చెస్‌‌‌‌ వరల్డ్‌‌‌‌ కప్‌‌‌‌ ఫైనల్‌‌‌‌ తొలి గేమ్‌‌‌‌ డ్రా

పనాజీ: చెస్‌‌‌‌ వరల్డ్‌‌‌‌ కప్‌‌‌‌ ఫైనల్లో భాగంగా సోమవారం చైనా గ్రాండ్‌‌‌‌ మాస్టర్‌‌‌‌ వీ యి, జావోకిర్‌‌‌‌ సిందరోవ్‌‌‌‌ (ఉజ్బెకిస్తాన్‌‌‌‌) మధ్య జరిగిన తొలి గేమ్‌‌‌‌ డ్రా అయ్యింది. ఇద్దరు గ్రాండ్‌‌‌‌ మాస్టర్లు హోరాహోరీగా పోరాడటంతో గేమ్‌‌‌‌ 50 ఎత్తుల వరకు సాగింది. ఫలితం వచ్చే చాన్స్‌‌‌‌ లేకపోవడంతో డ్రాకు అంగీకరించారు. నల్ల పావులతో ఆడిన వీ యి పెట్రోవ్‌‌‌‌ డిఫెన్స్‌‌‌‌తో ముందుకొచ్చాడు. తెల్లపావులతో ఆడిన సిందరోవ్‌‌‌‌ను గేమ్‌‌‌‌ మధ్యలో బాగా కట్టడి చేశాడు. ఓ దశలో బిషప్‌‌‌‌–పాన్‌‌‌‌ ఎండ్‌‌‌‌ గేమ్‌‌‌‌తో బలమైన పొజిషన్‌‌‌‌లో నిలిచాడు. 

కానీ వెంటనే తేరుకున్న సిందరోవ్‌‌‌‌ కొన్ని పావులను త్యాగం చేసి వీ యి విసిరిన సవాల్‌‌‌‌ నుంచి తృటిలో తప్పించుకుని గేమ్‌‌‌‌ను డ్రా వైపు తీసుకెళ్లాడు. మూడో ప్లేస్‌‌‌‌ కోసం జరిగిన తొలి గేమ్‌‌‌‌లో ఆండ్రీ ఎసిపెంకో (ఫిడే).. నొడిర్బెక్‌‌‌‌ యాకుబోవ్‌‌‌‌ (ఉజ్బెకిస్తాన్‌‌‌‌)పై గెలిచాడు. సిసిలియన్‌‌‌‌ డిఫెన్స్‌‌‌‌తో ఆడిన నొడిర్బెక్‌‌‌‌ను ఎసిపెంకో కీలక టైమ్‌‌‌‌లో అడ్డుకున్నాడు. ఎండ్‌‌‌‌ గేమ్‌‌‌‌పై పూర్తి ఆధిపత్యం చూపెట్టి విజయం సాధించాడు.