
పది మంది హీరో హీరోయిన్స్‌తో యూత్‌ఫుల్ లవ్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిస్తున్న చిత్రం ‘యో.. 10 ప్రేమకథలు’. నంది అవార్డ్ గ్రహీత మనోహర్ చిమ్మని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను పిసి క్రియేషన్స్ సమర్పణలో మనూటైమ్ మూవీ మిషన్ సంస్థ నిర్మిస్తోంది. సోమవారం పూజా కార్యక్రమాలతో చిత్ర ప్రారంభోత్సవం జరిగింది. దర్శకులు వీరశంకర్ మూవీ పోస్టర్‌పై క్లాప్ కొట్టారు. చంద్ర మహేష్, బాబ్జీ, ప్రియదర్శిని అతిథులుగా హాజరై బెస్ట్ విషెస్ చెప్పారు.
మనోహర్ మాట్లాడుతూ ‘ఒక్కో జానర్‌లో ఒక్కో ప్రేమకథతో మొత్తం పది కథలు ఉంటాయి. అయితే వాటన్నింటి లక్ష్యం ఒకటే. అది యువతను కనెక్ట్ చేస్తుంది. నటీనటుల వివరాలను త్వరలోనే ప్రకటిస్తాం’ అని చెప్పారు.