విద్యార్థులకు ధ్యానంపై శిక్షణ : ఇండియాను ఆదర్శంగా తీసుకున్న ఆస్ట్రేలియా

విద్యార్థులకు ధ్యానంపై శిక్షణ : ఇండియాను ఆదర్శంగా తీసుకున్న ఆస్ట్రేలియా

భగవద్గీతలోని సారాంశాన్ని పలు దేశాలు కమ్యునికేషన్ స్కిల్స్ పేరుతో కోచింగ్ లు ఇస్తుండగా..ఇప్పుడు యోగా, ధ్యాన కేంద్రాలు కూడా వెలిశాయి. ఆస్ట్రేలియాలో పలు స్కూల్స్ లో చిన్నప్పట్నుంచే ధ్యానం కిడ్స్ కి ధ్యానం చేయడం నేర్పిస్తున్నారు. యోగా, ధ్యానంతో ఆరోగ్యంగా ఉండవచ్చని పిల్లలకు బోధిస్తున్నారు. స్కూల్ పిల్లలు ఎలాంటి ధ్యాన ప్రక్రియ చేయాలనేదానిపై ట్రైనింగ్ ఇస్తున్నారు. చదువుల వల్ల కలిగే ఒత్తిడిని జయించడం, భయాన్ని దూరం చేసుకోవడం, సబ్జెక్టులపై ఇంట్రెస్ట్ రావడానికి ధ్యానం బెటర్ అంటోంది ఆస్ట్రేలియా బ్రిస్బేన్‌ లోని ఓ స్కూల్. మెడిటేషన్ టీచర్లతో పిల్లలకు ట్రైనింగ్ ఇప్పిస్తున్నారు. పిల్లలు కూడా శ్రద్ధగా ధ్యానం చేస్తున్నారు.

ప్రస్తుతం ఈ ఒక్క స్కూల్ లోనే ధ్యానాన్ని నేర్పిస్తున్నప్పటికీ దీనిని దేశవ్యాప్తంగా అన్ని స్కూల్స్ లో ప్రవేశపెడితే బాగుంటుందని అక్కడి టీచర్లు ప్లాన్ చేస్తున్నారట. ఆస్ట్రేలియా ప్రభుత్వం ఇంట్రెస్టింగానే ఉన్నట్లు తెలుస్తోంది. మన దేశ సంస్కృతి, సంప్రదాయాలతో పాటు ఇప్పుడు..భగవద్గీత, యోగా, ధ్యానం కూడా విదేశాల్లో పాకడం సంతోషకరమైన విషయం అంటున్నారు. అయితే ఫారిన్ కల్చర్ ఫాలో అయ్యే కొంతమంది ఇండియన్స్..ఇలాంటివి చూసైనా మారాలని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.