
న్యూఢిల్లీ: రాముడి జన్మ స్థలమైన ఉత్తర్ ప్రదేశ్‌లోని అయోధ్యను, సీత పుట్టిన బిహార్‌లోని సీతామఢిని కలిపేలా కొత్త రోడ్ నిర్మాణం కానుంది. ఈ విషయాన్ని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు. హిస్టారికల్‌గా, మైథలాజీపరంగా హిందువులకు చాలా ప్రాముఖ్యమైన ఈ రెండు నగరాలను కలిపే రూట్‌ను రామ్-జానకి మార్గ్‌గా పిలవనున్నట్లు బిహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో యోగి తెలిపారు. రామ మందిర నిర్మాణం మొదలైన సందర్భంగా బిహారీలకు ఆదిత్యనాథ్ శుభాకాంక్షలు చెప్పారు. కొత్త రూట్ ద్వారా 5 నుంచి 6 గంటల్లో అయోధ్య నుంచి సీతామఢికి చేరుకోవచ్చన్నారు.