కరోనా టెస్ట్ ఎట్ల చేస్తరో తెలుసా?

కరోనా టెస్ట్ ఎట్ల చేస్తరో తెలుసా?

గొంతు, ముక్కు నుంచి శాంపిల్​ 

మొదట స్క్రీనింగ్​ టెస్ట్​.. తర్వాత కన్ఫర్మేషన్​ టెస్ట్​

రాష్ట్రంలో రోజుకు 650 శాంపిళ్ల పరీక్ష

3 షిఫ్టుల్లో కష్టపడుతున్న స్టాఫ్​

హైదరాబాద్, వెలుగు: కరోనా బాధితుల సంఖ్య పెరుగుతుండడంతో చేయాల్సిన టెస్టుల సంఖ్య కూడా పెరిగిపోతోంది. ప్రస్తుతం మన రాష్ర్టంలో రోజుకు సుమారు 650 శాంపిళ్లను పరీక్షిస్తున్నారు. గాంధీ, ఉస్మానియా, ఫీవర్ హాస్పిటల్‌‌‌‌, నిమ్స్‌‌‌‌, వరంగల్ ఎంజీఎం, సీసీఎంబీ ల్యాబుల్లో టెస్టులు చేస్తున్నారు. దీనికోసం ల్యాబ్‌‌‌‌ టెక్నీషియన్లు, మైక్రోబయాలజీ ప్రొఫెసర్లు మూడు షిఫ్టుల్లో కష్టపడుతున్నారు.

కన్ఫర్మేషన్ టెస్టు కూడా ఇక్కడే..

ముందుగా వైరస్ లక్షణాలు ఉన్నాయని గుర్తించిన వ్యక్తుల గొంతు, ముక్కులో నుంచి శాంపిల్​తీసుకుంటారు. దీన్ని 48 గంటల నుంచి 72 గంటల వరకూ నిల్వ చేయొచ్చు. రివర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ట్రాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌క్రిప్టేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాలిమరైజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రియాక్షన్‌‌‌‌(ఆర్టీ పీసీఆర్‌‌‌‌‌‌‌‌) మెథడ్‌‌‌‌లో వీటిని పరీక్షిస్తారు. రోగి శరీరంలో వైరస్ లోడ్‌‌‌‌ తక్కువగా ఉన్నా, ఇందులో గుర్తించే అవకాశం ఉంటుంది. ఈ టెస్టు చేయడానికి కనీసం ఐదారు గంటలు పడుతుంది. ల్యాబ్‌‌‌‌లో ఉన్న మెషీన్ల కెపాసిటీని బట్టి ఒకేసారి 50 శాంపిళ్లను కూడా పరీక్షించొచ్చు. గొంతు, ముక్కు నుంచి తీసుకున్న శాంపిల్​ను కెమికల్​లో కలిపి టెస్ట్ చేస్తారు. ఈ మెథడ్‌‌‌‌లో రోగి నుంచి తీసుకున్న శాంపిల్‌‌‌‌లో ఒక్క వైరస్‌‌‌‌ కణం ఉన్నా, కొన్ని వేల రెట్లు చేసి చూపిస్తుంది. ఇందులో పాజిటివ్ వస్తే, మరో టెస్ట్ చేస్తారు. రెండూ ఒకే రకం టెస్టులైనప్పటికీ, టెస్టింగ్ కిట్లు మాత్రం వేర్వేరుగా ఉంటాయి. మొదట చేసే టెస్టును స్ర్కీనింగ్ టెస్ట్‌‌‌‌ అని, రెండో టెస్ట్‌‌‌‌ను కన్ఫర్మేషన్ టెస్ట్‌‌‌‌ అంటారు. మన రాష్ర్టంలో తొలుత స్ర్కీనింగ్ టెస్ట్‌‌‌‌ మాత్రమే చేసేవారు. కన్ఫర్మేషన్ టెస్ట్ కోసం శాంపిల్​ను పుణే వైరాలజీ ల్యాబ్‌‌‌‌కు పంపించేవారు. కానీ, ఇప్పుడు రెండూ ఇక్కడే చేస్తున్నారు.  టెస్టింగ్ కిట్లను ఐసీఎంఆర్‌‌‌‌‌‌‌‌ ప్రొవైడ్ చేస్తోంది. కన్ఫర్మేషన్ టెస్ట్ చేయడానికి కనీసం గంటన్నర నుంచి రెండు గంటల టైమ్ పడుతుంది.

For More News..

మెడికల్​ వర్కర్లకు  50 లక్షల ఇన్సూరెన్స్

లాక్‌డౌన్ కంటిన్యూ?

పేషెంట్లు మామూలు ట్రీట్‌మెంట్‌తోనే మంచిగైతున్నరు